Maryam Asif Siddiqui | Bhagwad Gita | competition

Maryam asif siddiqui muslim girl wins bhagwad gita competition

Maryam Asif Siddiqui, Bhagwad Gita , competition, isckon, mumbai, Krishna

Breaking the religious barriers, twelve-year-old Muslim girl Maryam Asif Siddiqui has won a competition on understanding the Bhagwad Gita. More than 3000 participants from 195 schools in Mumbai took part in the competition organised by the International Society for Krishna Consciousness.

భగవద్గీత పై జరిగిన పోటీలో గెలిచిన ముస్లిం బాలిక

Posted: 04/03/2015 05:04 PM IST
Maryam asif siddiqui muslim girl wins bhagwad gita competition

మానవత్వమే అన్నింటిని మించిన మతం అని ఏ సాధువో లేక ఎంతో వయస్సుమీరిన ముసలి వ్యక్తో చెప్పిన మాటలు కాదు. పట్టుమని పన్నెండు సంవత్సరాలు కూడా లేని ఓ ముస్లిం బాలిక చెప్పిన జీవిత సత్యం. అంతేకాదు భగవద్గీతపై నిర్వహించిన పరీక్ష పోటీలో ముస్లిం విద్యార్థిని ప్రథమ స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇస్కాన్(ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్) సంస్థ 'గీతా చాంపియన్స్ లీగ్' అనే అంశంపై పరీక్ష పోటీ నిర్వహించింది. అందులో ఆరోతరగతి చదువుతున్న పన్నెండేళ్ల మర్యమ్ సిద్ధిఖీ తొలి బహుమతిని అందుకోవడం విశేషం. 3000 మంది పాల్గొన్న ఈ పోటీలో మిగితావారందరిని వెనుకకు నెట్టి ఆ బాలిక తొలిస్థానంలో నిల్చుని బహుమతి అందుకుంది.

గీతకు సంబందించి ఓ పోటీ ఉందని తన టీచర్ చెప్పడంతో పోటీలో పాల్గొన్నానని మర్యమ్ సిద్ధిఖీ వెల్లడించింది. గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన కథలంటే తనకెంతో ఇష్టమని కూడా తెలిపింది. గీతలో శ్రీకృష్ణుడు ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, అందరిని ఎలా గౌరవించాలి ఇలా అన్ని విషయాలను అర్జునుడికి తెలిపారు అని మర్యమ్ తెలిపింది. తాను ఖాళీగా ఉన్న సమయాల్లో మతాలకు సంబంధించిన పుస్తక పఠనం చదువుతానని, ఎప్పుడైతే ఈ కాంపిటేషన్ గురించి విన్నానో అప్పుడే భగవద్గీత గురించి తెలుసుకునే అవకాశం వస్తుందని ఆలోచించి చదవడం నేర్చుకున్నానని తెలిపింది. ఆ ప్రిపరేషనే తనకు మొదటి బహుమతి రావడానికి కారణమైందని వివరించింది. మొత్తానికి హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత కు సంబందించిన పోటీలో ముస్లి బాలిక ప్రైజ్ గెలుచుకోవడం ఎంతో స్పెషల్ . అందుకే ఆమె వార్తలకెక్కింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maryam Asif Siddiqui  Bhagwad Gita  competition  isckon  mumbai  Krishna  

Other Articles