Bihar court orders FIR against Giriraj Singh

Case against giriraj singh for racist remark

Muzaffarpur, Giriraj Singh, Cjm Court, Case Registered, Sonia Gandhi, sonia gandhi, giriraj singh, giriraj singh racist remark, giriraj singh sonia gandhi, giriraj sonia remark, giriraj white skin remark, giriraj singh controversy, india latest news"

A complaint was filed against Union Minister Giriraj Singh in a district court on Thursday by a Congress worker for his racist remarks against Congress president Sonia Gandhi.

గిరిరాజ్ సింగ్ పై కేసు నమోదు, వ్యాఖ్యలపై స్పందించని సోనియా

Posted: 04/02/2015 10:17 PM IST
Case against giriraj singh for racist remark

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌పై కేసు నమోదు చేయాలని బీహార్‌లోని ముజఫర్‌పూర్ సీజేఎం న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. సోనియా గాంధీ తెల్ల జాతీయురాలు కాబట్టే అమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆ పార్టీ నేతలు అంగీకరించిందని, అదే సోనియా నైజీరియా మహిళ అయి ఉంటే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అంగీకరించి ఉండేవారు కాదని గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించడంపై కోర్టు అతడిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

కేంద్ర మంత్రి వ్యాఖ్యాలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన న్యాయవాది సీజేఎం కోర్టులో వేసిన పిటిషన్ విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. కాగా, గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ్ ఖండించారు. ఆ వ్యాఖ్యలు ఓ కేంద్ర మంత్రి చేయాల్సిన వ్యాఖ్యలు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి పదవిలో ఉన్నప్పుడు భాషను సరిచూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పందించేందుకు నిరాకరించారు. సంకుచిత మనత్తత్వం కలిగిన వారని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యాలపై తాను స్పందించబోనని చెప్పారు. తన శరీర వర్ణంపై వ్యాఖ్యానించడం వల్ల బీజేపీ అసలు రంగు బయటపడిందని, అంతకుమించి దీనిపై స్పందించాల్సిన అవసరం లేదంటూ ఆమె కొట్టిపారేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Muzaffarpur  Giriraj Singh  Cjm Court  Case Registered  Sonia Gandhi  

Other Articles