Two minor sisters kidnapped, gangraped by five men at gunpoint in Badaun

Two minor sisters allegedly kidnapped gangraped by five men at gunpoint in badaun

Two minor sisters kidnapped, gangraped, minor girls gang-raped at gunpoint, minor girls gang-raped by five people in Jareef Nagar, minor girls gang-rape in Badaun, minor girls gang-rape in Uttar Pradesh, crime against women, violence against women, rape on minors minor sisters rape, kidnap and rape of minor sisters, kidnap and rape of minor girls

Two minor girls, both cousins, were allegedly kidnapped and gang-raped at gunpoint by five people in Jareef Nagar area in Badaun in Uttar Pradesh.

మైనర్ అక్కాచెల్లెల్ల కిడ్నాప్, గ్యాంగ్ రేప్

Posted: 04/02/2015 09:58 PM IST
Two minor sisters allegedly kidnapped gangraped by five men at gunpoint in badaun

ఉత్తర్ ప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్ బాలికలకు మగమృగాళ్లు కిడ్నాప్ చేసి, వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అభం శుభం తెలియని అమాయక అక్కాచెల్లలను తుపాకులతో బెదింరించి ఐదుగురు మగమృగాళ్లు అత్యాచారం జరిపారు. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బౌడ్వాన్ ప్రాంతానికి చేరువలోని జరీప్ నగర్ లో చ,ోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు స్థానిక సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ సౌమిత్రి కథనం ప్రకారం ఇలా వున్నాయి.

గత రాత్రి వేళ ఏదో పనిపై ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ఇద్దరు వరసకు అక్కాచెల్లళ్లును స్థానికంగా వుంటే అన్నాదమ్ములు తుపాకీతో బెదిరించి.. వారిని కిడ్నాప్ చేశారు. వారి నోళ్లను మూసివేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరు అన్నదమ్ములతో పాటు మరో ముగ్గురు మగమృగాళ్లు పాశవికంగా వారిపై సామూహికంగా అత్యాచారం చేశారు. అయితే వీరి అరుపులతో స్థానిక గ్రామస్థులు తరలిరావడంతో నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాళ్లను పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.

పద్నాలుగు, పదిహేనేళ్ల వయస్సున్న ఇద్దరు అక్కా చెల్లెళ్లను బౌడ్వాన్ ప్రాంతంలో చెట్టు ఉరివేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం రేపింది. వారి వైద్య నివేదికలను పరిశీలించిన తరువాత వారిది అత్యాచారం, హత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతుండగా, ఈ ఘటనపై కేసును సీబీఐకి బదిలీ చేశారు. కాగా పలు మార్లు కేసును, పూర్వపరాలను పరిశీలించిన సీబిఐ వారిది అత్మహత్యగా చెప్పిన ప్రాంతానికి చేరువలోనే ఇలాంటి ఘటనలు నమోదు కావడం కలకలం రేగింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  minor sisters  kidnap  GangRape  Crime  Badaun  

Other Articles