Papua New Guinea hit by 7.7 magnitude offshore quake

Papua new guinea hit by 7 7 offshore quake

Papua New Guinea hit by 7.7 offshore quake, 7.7-magnitude earthquake, US seismologists, "hazardous" tsunami warnigs, Tsunami, 1,000 kilometres of the epicentre. Kokopo city on New Britain island, United States Geological Survey, USGS, Pacific Tsunami Warning Centre

A 7.7-magnitude earthquake struck off the coast of Papua New Guinea today, US seismologists said, with "hazardous" tsunami waves possible within 1,000 kilometres of the epicentre.

7.7 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Posted: 03/30/2015 10:44 AM IST
Papua new guinea hit by 7 7 offshore quake

పాప్వా న్యూగినియాలో భారీ భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. సముద్రభూగర్భంలో 65 కిలోమీటర్ల లోతున.. సుమారుగా న్యూ బ్రిటెన్ ద్వీపంలోని కోకోపో పట్టణానికి 54 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియాలజిస్టు కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో సునామీ రావచ్చని అధికారులు హెచ్చరించారు. సునామీ ప్రభావంతో పెద్ద ఎత్తున అలలు ఎగసి పడుతున్నాయి. సునామీ సంభవిస్తే.. అలలు సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు ప్రభావాన్ని చూపుతాయని అమెరికా భూకంప తీవ్రత అంచనా అధికారులు హెచ్చరించారు.

ప్రాథమిక భూకంప పరిణామాల తీవ్రతను భట్టి వినాశకారి, భయనక అల్లలు పెద్ద ఎత్తున విరుచుకుపడే ప్రమాధముందని అమెరికా భూకంప తీవ్రత అంచనా అధికారులు తెలిపారు. తీర ప్రాంత ప్రజలు సాధ్యమైనం త్వరగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వారు సూచించారు. కాగా ప్రభుత్వం తక్షణ సహాయ చర్యలకు ఉపక్రమించింది. యుద్దప్రాతిపదికన తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా నివాసాలను వదలి వెళ్లడానికి పలువురు ఆందోళన వ్యక్తం చేసినా.. ప్రాణాలు కాపాడుకునే చర్యలల్లో తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Papua New Guinea  7.7-magnitude earthquake  Tsunami  

Other Articles