Sachin Tendulkar Wax Statue | Maddame Tussauds Museum

Sachin tendulkars wax statue moved out of sydney maddame tussauds museum

Sachin Tendulkar, Sachin Tendulkar news, Sachin Tendulkar latest updates, Sachin Tendulkar wax statue, Sachin Tendulkar updates, Sachin Tendulkar cricket career, sachin wax statue in sydney, sydney maddame tussauds museum

Sachin Tendulkars Wax Statue Moved Out of Sydney Maddame Tussauds Museum : Sydney Maddame Tussauds Museum has transferred sachin tendulkar's wax statue to another place without giving any information

సచిన్ ‘మైనపు’ బొమ్మను ఆ మ్యూజియం నుంచి తీసేశారు..?

Posted: 03/30/2015 08:28 AM IST
Sachin tendulkars wax statue moved out of sydney maddame tussauds museum

క్రికెట్ లెజెండ్ గా పేరుగాంచిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మైనపు బొమ్మను మేడమ్ టుస్సాడ్స్ (madame tussauds) మ్యూజియంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే! ఇలా బొమ్మను ఏర్పాటు చేసిన సందర్భంగా భారతీయ అభిమానులు ఎంతో సంతోషంగా పొంగిపోయారు. సచిన్ కి గుర్తింపుగా ఈ విధంగా మైనపు బొమ్మను ఏర్పాటు చేయడంపై క్రీడాజగత్తు హర్షం వ్యక్తం చేసింది. అయితే.. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ.. క్రీడాభిమానులు షాక్ కు గురయ్యేలా సచిన్ బొమ్మను ఆ మ్యూజియం నుంచి తీసేసినట్లు సమాచారం!

రెండేళ్ల క్రితం సచిన్ మైనపు బొమ్మను సిడ్నీలోని ఓ మైదానంలో ప్రదర్శించిన అనంతరం దాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టడం జరిగింది. ఇక అప్పటినుంచి ఆ మ్యూజియాన్ని సందర్శించే ప్రతిఒక్కరు సచిన్ ప్రతిమ దగ్గర నిలబడి ఎంతో గర్వంగా ఫోటోలు తీసుకుని మురిసిపోయేవారు. అయితే.. కొన్ని నెలలుగా ఆ మ్యూజియంలో సచిన్ బొమ్మ లేనట్లు ఆలస్యంగా తెలిసింది. అలా తీసేయడం వెనుకగల కారణాలేంటని ఆరా తీయగా.. తమ ఇతర శాఖకు సచిన్ ప్రతిమను తరలించడం జరిగిందని టుస్సాడ్స్ అధికారులు స్పష్టం చేశారు.

ప్రపంచంలోని పలు నగరాల్లో మేడం టుస్సాడ్స్ కు ఇతర శాఖలున్నాయి. తమ మ్యూజియంలో తయారుచేసిన ప్రముఖుల బొమ్మలను ఒక శాఖ నుంచి మరో శాఖకు తరలించడం సర్వసాధారణమని టుస్సాడ్స్ పేర్కొంది. అంతా బాగానే వుంది కానీ.. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సచిన్ బొమ్మను ఇతర ప్రాంతాలకు ఎలా తరలిస్తారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin Tendulkar  Maddame Tussauds Museum  Sydney Cricket Grounds  

Other Articles