bjp party membership | communist party of china | Narendra Modi | Amit Shah

Bjp becomes largest political party in the world

bjp party news, amith shah news, bjp party ministers, bjp party updates, narendra modi news, narendra modi updates, narendra modi twitter, bjp party membership, Communist Party of china, amit shah narendra modi

BJP becomes largest political party in the world : The ruling BJP has become the largest political party in the world with its enrolment drive in the past five months taking its membership to 8.80 crore. The Communist Party of China was until now considered the largest party with about 8.60 crore members.

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయపార్టీగా అవతరించిన ‘బీజేపీ’

Posted: 03/30/2015 08:50 AM IST
Bjp becomes largest political party in the world

ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో ఎన్నడూలేని విధంగా రికార్డు విజయాన్ని నమోదు చేసిన భారతీయ జనతాపార్టీ (బీజేపీ).. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఘనతను సాధించింది. 8.8 కోట్ల మంది సభ్యులతో ఆ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. నిన్నటిదాకా 8.6 కోట్ల మంది సభ్యులతో ‘కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా’ అతిపెద్ద పార్టీ కొనసాగుతూ వస్తోంది కానీ.. తాజాగా ఆ పార్టీ రికార్డును బీజేపీ అధిగమించింది.

మోడీ ప్రధాని పగ్గాలు చేపట్టినప్పటి నుంచి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆ పార్టీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఇతర పార్టీ నేతలు ఎంతోమంది బీజేపీలోకి జంప్ అయ్యారు. ఇంకా సభ్యత్వ నమోదు కొనసాగుతూనే వుంది. అయితే.. ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారి సంఖ్య ప్రస్తుతానికి 8.8 కోట్లు దాటింది. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న అమిత్ షా దిశానిర్దేశంతో పార్టీ నేతలు సభ్యత్వ నమోదు వేగాన్ని పెంచారు. మరికొన్నాళ్లపాటు సాగే ఈ సభ్యత్వ నమోదులో 10 కోట్ల మంది సభ్యులను చేర్చాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఆ దిశగానే నేతలు వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ సభ్యత్వ నమోదు సంఖ్య 8.8 కోట్లకు చేరింది.

అమిత్ షా పిలుపునిచ్చినట్లు పార్టీ సభ్యత్వ నమోదు సంఖ్య 10 కోట్లు మందికి చేరితో.. భవిష్యత్తులో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా బీజేపీ దరిదాపుల్లోకి వచ్చే అవకాశమే వుండదని భావిస్తున్నారు. ఏదైతేనేం.. ఇదంతా మోడీ హవా కారణంగానే జరుగుతోందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతాబాగానే వుంది కానీ.. పాలనావిషయంలో బీజేపీ వెనకపడితే.. ఈ సంఖ్య తగ్గే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp party news  amit shah  narendra modi  communist party of china  

Other Articles