High court | GHMC | commissioner | someshkumar

High court said that ghmc commisioner someshkumar bahave like a monark

High court, GHMC, commissioner, taxes, someshkumar, assets,

high court said that ghmc commisioner someshkumar bahave like a monark. the greater hyderabad muncipal corporation commissionor somesh kumar behave like monark, for the collection of taxes.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌.. ఓ మోనార్క్‌..!

Posted: 03/27/2015 09:17 AM IST
High court said that ghmc commisioner someshkumar bahave like a monark

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ తీరుపై హైకోర్టు మండిపడింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆస్తి పన్ను బకాయిల నెపంతో అత్యవసర సర్వీసులైన మంచినీరు, విద్యుత్‌ సౌకర్యాలను నిలుపుదల చేయడానికి ఏ చట్టం అనుమతిస్తుందని.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కళ్యాణజ్యోతి సేన్‌గుప్త, జస్టిస్‌ పీవీ సంజయ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాదిని నిలదీసింది. ‘‘మీ కమిషనర్‌కు చట్టాలు తెలియవా? జీహెచ్‌ఎంసీ సొంత యాక్టులోనే ఇటువంటి చర్యలు తీసుకోడానికి వీలులేదు’’ అని  హైకోర్ట్ చురకలంటించింది. ‘‘మీరు విద్యుత్‌ సరఫరా చేయరు, మంచినీరు ఇవ్వరు, డ్రైనేజీ నిర్వహణ చూడరు.. మీరు చేసేదల్లా చెత్తను సేకరించడం. అటువంటప్పుడు ఇతర సంస్థలు ఇస్తున్న సేవలను మీరెలా నిలిపివేస్తారు?’’ అని నిలదీసింది.

ఆస్తి పన్ను చెల్లించాలని జీహెచ్‌ఎంసీ మార్చి 19న రంగారెడ్డి జిల్లాకు చెందిన జె.జయపాల్‌ అనే వ్యక్తికి నోటీసు ఇచ్చింది. అదే రోజున విద్యుత్‌ కనెక్షన్‌, వాటర్ సప్లైని కట్ చేశారు. హైకోర్ట్ దీనిపై మండిపడింది. కమిషనర్‌ తనకు తాను హైదరాబాద్‌ నిజాం గా భావించుకుంటున్నారా? ఆయన చర్యలు నిజాం సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్నాయి అని సోమేష్ కుమార్ గురించి వ్యాఖ్యానించింది. ఇలా చర్యలకు మరోసారి పాల్పడితే తీవ్ర పరిణామాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. మొత్తానికి పన్నులను సేకరించే పనిలో పడి, పౌరులకు కలిగిస్తున్న ఇబ్బందులపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఒక్క జిహెచ్ఎంసీ కి మాత్రమే కాదు అన్ని మున్సిపల్ కార్పోరేషన్ లకు చెంపపెట్టులాంటిది. కనీసం ఇక మీదనైనా పన్నులపై కాకుండా సేవలపై దృష్టి సారిస్తాయని ఆశిద్దాం.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High court  GHMC  commissioner  taxes  someshkumar  assets  

Other Articles