Aap | NMC | Remove

Aap ready to sendoff to prashanthbhushan and yogenderyadav

aap, kejriwal. prashanthbhushan, yogenderyadav, aam admi party

aap ready to sendoff to prashanthbhushan and yogenderyadav.he negotiations to end the infighting in the Aam Aadmi Party ended in bitter acrimony on Thursday as the party headed for a showdown at Saturday's National Council meeting.

వారిని పార్టీ నుండి పంపించేస్తారా..?

Posted: 03/27/2015 10:30 AM IST
Aap ready to sendoff to prashanthbhushan and yogenderyadav

ఆమ్ ఆద్మీ పార్టలో గత కొంత కాలంగా నడుస్తున్న వివాదాలకు తెరదించాలని బావిస్తోంది. అందులో భాగంగా ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లను సాగనంపాలా లేక అలాగే కొనసాగించాలా అన్న అంశంపై పలు చర్చలు జరిగాయి. శనివారం పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ కు ముందుగానే పార్టీలో సంక్షోభానికి తెర దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే పార్టీ నుండి ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లను సాగనంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు సమాచారం.

* పార్టీలో తలెత్తిన సంక్షోభాన్ని నివారించడానికి ఆప్ పార్టీ శనివారం జరగనున్న నేషనల్ కౌన్సిల్ మీటింగ్ కు ముందే కేవలం 24  గంటల్లోనే రెండు సార్లు సమావేశమయింది.
* తాము విధించిన షరతులను పార్టీ అమలు చేస్తుందని హామీ ఇస్తే, రాజీనామాకు సిద్దమని మార్చి 17న యోగేంద్రయాదవ్, ప్రశాంత్ భూషణ్ లు పార్టీకి లేఖలు రాశారు.
* ప్రశాంత్ భూషణ్ అసలు కేజ్రీవాల్ ఆప్ కన్వీనర్ పదవికి రాజీనామా చెయ్యాలని అననే లేదని మీడియా ముందు చెప్పుకొచ్చారు.కేవలం మీడియా కట్టుకథలే అని కొట్టిపారేశారు.
* పార్టీలో ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ ల గురించి దాదాపుగా అన్ని దారులు మూసుకుపోయాయని సంజయ్ సింగ్ మీడియాకు తెలిపారు.
* పార్టీ ముఖ్య పదవుల నుండి ఇద్దరు నేతలను తొలగించాలని గతంలోనే పార్టీ ఓటింగ్ ద్వారా నిర్ణయించిందని మనీష్ సిసోడియా తెలిపారు. కాగా ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ రాజీనామా విషయంలో పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
* ఆప్ లో పార్టీ నేతలతో పాటు వాలంటీర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారి నిర్ణయాన్ని గౌరవించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.
* అసలు పార్టీలో ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్ లను కొనసాగించడానికి కేజ్రీవాల్ సుముఖంగా లేని కారణంగా, కేజ్రీవాల్ బృందం వారిని సాగనంపే పనిలో ఉంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aap  kejriwal. prashanthbhushan  yogenderyadav  aam admi party  

Other Articles