German Airbus crash: Cockpit voice tape suggests pilot locked out

German airbus crash cockpit voice tape suggests pilot locked out

142 Passengers , French Alps , Airbus A320 Crashes , 6 Crew On Board , German Airbus A320 Plane Crashes, German Airbus crash, German Airbus cockpit voice recordings, pilot locked out, pilots left the cockpit, Germanwings Crash, Airbus A320, Pilot Locked Out, France, Accident, Germany, Plane, Aviation, Crew, Paris, Fance, Plane Crash, Airbus A320

Investigators have retrieved cockpit voice recordings from one of the "black boxes" of the German jet that crashed in the Alps, killing everyone onboard, and the New York Times said the audio showed one of the pilots left the cockpit and could not get back in before the plane went down.

జర్మన్ ఎయిర్ బస్ క్రాష్.. బ్లాక్ బాక్స్ వెల్లడించిన విషాదవార్తలు

Posted: 03/26/2015 03:50 PM IST
German airbus crash cockpit voice tape suggests pilot locked out

ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో జర్మన్‌ వింగ్ ఎయిర్‌బస్ ఎ320 కూలిపోవడానికి కారణాలు ఏంటన్న సందిగ్ధత అందరిలోనూ నెలకొంది. తరుచుగా విమానా ప్రమాదాలు చోటుచేసుకుని.. వందల సంఖ్యలో విమానయాన ప్రయాణికులు, సిబ్బంది మృత్యువాత పడటానికి గల కారణాలు ఏంటన్నది తెలుసుకునే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమై వున్నాయి. అయితే జర్మనీ వింగ్ కూలిపోవడానికి కారణం.. కాక్ పిట్ తలుపా..? లేక పైలెట్ కారణమా అన్న కోణంలోనూ తాజాగా దర్యాప్తు సంస్ధలు అన్వేషించనున్నాయి.

ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో కూలిపోయిన ఈ విమానం కాక్‌పిట్ వాయిస్ రికార్డరు(సీవీఆర్)ను అధికారులు తెరిచి చూశారు. అందులో లభించిన పలు రికార్డుల విన్న అధికారులు పైలట్ బయటికి వెళ్లి సకాలంలో లోపలికి చేరుకోకపోవడం కారణంగానే విమాన ప్రమాదం సంభవించిందని న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. బయటకు వెళ్లిన పైలైల్ కాక్ పిట్ తలుపు కొట్టినా.. సమాధానం రాలేదని, దీంతో మరింద బిగ్గరగా కోట్టారని, అయినా సమాధానం రాకపోవడంతో.. విమానం తలుపు బద్దలు కోట్టేలా బాదాడని రికార్డింగ్ లలో స్పష్టమవుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి వివరాలను తెలిపినట్లు ప్రతిక కథనంలో ప్రచురించింది.

కాక్పిట్ వాయిస్ రికార్డర్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఆ అధికారి విమానం కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు  ఏం జరిగిందనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. అయితే  పైలట్ కాక్పిట్ నుంచి బయటకు వెళ్లి, మళ్లీ తిరిగి కాక్పిట్లోకి ఎంటర్ కావడానికి ప్రయత్నించి విఫలమైన విషయం స్పష్టంగా రికార్డు అయినట్లు చెబుతున్నా.. అసలు పైలట్ కాక్ పిట్ వదిలి బయటకు ఎందుకు వెళ్లాడన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే పూర్తి వివరాలు మాత్రం మరికోన్ని రోజుల తరువాతే వెల్లడవుతాయని దర్యాప్తు అధికారులు వెల్లడిస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Airbus A320 Crashes  pilot locked out  142 Passengers  French Alps  

Other Articles