BJP | win | mlc | telangana

Bjp party won a seat in the mlc elections at telanagana

trs, bjp, ramchandrarao, deviprasad, mlc, elections, council, telangana, win

in Telangana, the TRS’ Devi Prasada Rao lost to TDP-supported BJP candidate N. Ramachandra Rao in the Hyderabad-Ranga Reddy-Mahbubnagar graduates’ constituency.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం దెబ్బకు కారు బోల్తా

Posted: 03/26/2015 08:31 AM IST
Bjp party won a seat in the mlc elections at telanagana

తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ కు ఎదురుదెబ్బతగిలింది. ఎన్నికల ఫలితాలతో కారు తిరగడింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్ధి దేవీప్రసాద్ ఓటమిపాలయ్యారు. మొదటి ప్రాధాన్య ఓటుతోనే బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గెలుపొందారు. 13,318 ఓట్ల ఆధిక్యతతో ఎన్నికల్లో విజయభేరి మోగించారు. మొత్తం 1,11,739 ఓట్లు పోల్ కాగా రామచంద్రరావుకు 53,881 ఓట్లు, దేవీప్రసాద్‌కు 40,563 ఓట్లు లభించాయి. లెక్కింపు పూర్తయి ఫలితం తెలిసినప్పటికీ ఎన్నికల కమిషన్ అనుమతితో వివరాలను గురువారం ప్రకటించనున్నారు. కాగా, వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజక వర్గంలో ఓట్ల లెక్కింపు నెమ్మదిగా సాగడంతో గురువారం మధ్యాహ్నానికి తుది ఫలితం వస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.  ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం  కోసం టీఆర్‌ఎస్ తీవ్రంగా శ్రమించింది. మంత్రులు హరీశ్‌రావు, కె.తారకరామారావులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో మంత్రులు పూర్తిగా ప్రచారంపైనే దృష్టి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో ఏకంగా డిప్యూటీ సీఎం సహా ఐదుగురు మంత్రులు విస్తృత ప్రచారం చేశారు. ఇంత చేసినా ఫలితం ప్రతికూలంగా రావడంపై టీఆర్‌ఎస్ వర్గాలు అంతర్మథనంలో పడ్డాయి.

ఇది ప్రభుత్వ వ్యతిరేక తీర్పు. మూడు జిల్లాల్లోని పట్టభద్రులు, విద్యావంతులు, ఓయూ విద్యార్థుల పాత్ర ఉందని బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచంద్రరావు వెల్లడించారు.  టీడీపీ, లోక్‌సత్తా, కొన్ని సంస్థలు, విద్యార్థి సంఘాలు తన గెలుపు ఎంతో కోసం కృషి చేశాయని తెలిపారు. గెలుపు కోసం అధికార పార్టీ డబ్బులు వెదజల్లిందని. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లను బెదిరించిందని అన్నారు. ఇది ప్రభుత్వ వ్యతిరేక తీర్పు కాదని, నామినేషన్ ఆలస్యం కావడంతో ఓటర్లకు చేరువ కాలేకపోయామని టిఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ అన్నారు. రామచంద్రరావు రెండు సార్లు మండలి, ఒకసారి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఓడిపోయారని, దీని వల్ల ఓటర్లను ఎక్కువసార్లు కలుసుకున్న నేత గా ఆయనకు అధిక ఓట్లు వచ్చాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీలు ఒక్కటై టీఆర్‌ఎస్‌ను ఓడించాయని వెల్లడించారు. మొత్తానికి తెలంగాణలో తిరుగులేని పార్టీగా ఎదిగిన టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలు గట్టి గుణపాఠాన్ని తెలిపాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trs  bjp  ramchandrarao  deviprasad  mlc  elections  council  telangana  win  

Other Articles