TDP | Lost | MLC

Tdp loose a mlc seat in andhrapradesh in recent elections

tdp, ap, chandrababu, suryarao, chaithanyaraju, mlc, elctions,

telugu desam party lost a seat in the mlc elections for the godavari dist. constution in andhrapradesh. chithanya raju who from tdp party defeated by suryara

తెలుగు 'దేశం'లొ ఎదురుగాలి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి

Posted: 03/26/2015 08:35 AM IST
Tdp loose a mlc seat in andhrapradesh in recent elections

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి ఒక చోట మోదం మరోచోట ఖేదం మిగిలాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి రామకృష్ణ ఘన విజయం సాధించారు. 1763 ఓట్ల భారీ మెజారిటీతో మొదటి ప్రాధాన్య ఓట్లతోనే గెలుపొందారు. కానీ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ  ఓటమి పాలైంది. డీపీ అభ్యర్థిగా ప్రస్తుత శాసనమండలి విప్‌ చైతన్యరాజు, యూటీఎఫ్‌ బలపరిచిన రాము సూర్యారావు, టీడీపీ రెబెల్‌ కృష్ణారావు మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.అయితే రాము సూర్యారావుకు 7751, చైతన్యరాజుకు 5769, పరుచూరి కృష్ణారావుకు 3380 ఓట్లు పడ్డాయి. దీంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సి వచ్చింది. ఈ లెక్కింపులో సూర్యారావునే విజయం వరించింది.

అలా తెలుగుదేశం పార్టీ ఎంతో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, జాతీయంగా, అంతర్జాతీయంగా ఎంతో చరిష్మా ఉన్న చంద్రబాబు నాయుడు కు ఈ ఎన్నికల్లో గట్టి ఎదురు బెద్ద తగిలిందని తెలుస్తోంది. అయితే టిడిపి విజయం అనే కన్నా రాము సూర్యారావు, మంచితనమే గెలుపులో కీలకంగా మారింది అన్నది టిడిపి వర్గం వాదన. గత కొంత కాలంగా రాము సూర్యారావు, చేస్తున్న విశేష కృషి చేశారని అందుకే, గెలుపు సులభమైందని వారు వాదిస్తున్నారు. అయితే టిడిపికి వ్యతిరేకంగా టీచర్ యూపియన్లు పని చేశాయని, టిడిపి లో రెబల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడటంతో టిడిపికి గట్టి దెబ్బతటిలింది. మొత్తానికి తెలుగుదేశం ప్రాభవానికి వ్యతిరేకంగా ఉభయ గోదావరి జిల్లాల్లో వ్యతిరేక పవనాలు వీశాయి. మరి తెలుగుదేశం పార్టీ ఎలా తీసుకుంటుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tdp  ap  chandrababu  suryarao  chaithanyaraju  mlc  elctions  

Other Articles