Former PM Manmohan Singh moves Supreme Court to quash court order in coal scam | Manmohan Singh

Former pm manmohan singh moves supreme court to quash court order in coal scam

Former PrimeMinister Manmohan Singh, Former PM Manmohan Singh moves to Supreme Court, manomohan moves Supreme Court to quash court order in coal scam, coal scam, coal gate, cbi court notices to manmohan, manmohan moves to supreme court

Former Prime Minister Manmohan Singh moved the Supreme Court on Wednesday to quash the order by the special CBI court in the coal scam.

బొగ్గు మరక: సుప్రీంకోర్టును ఆశ్రయించిన మన్మోహన్,

Posted: 03/25/2015 06:06 PM IST
Former pm manmohan singh moves supreme court to quash court order in coal scam

యూపీఏ హాయంలో జరిగిన కుంభకోణాల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు కేంద్ర మాజీ మంత్రలపై సైతం ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మౌనమునిలా ఇన్నాళ్లు ప్రధాని పీఠంపై కూర్చోని వున్న మన్మోహనుడికి సైతం బొగ్గు మరకలు అంటాయి. దీంతో ఆయన తనపై కింది కోర్టు జారీ చేసిన పిటీషన్ ను కోట్టివేయాలని కోరుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బొగ్గు కుంభకోణం కేసులో తనను నిందితుడిగా పేర్కొంటూ కింది కోర్టు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన సవాల్‌ చేశారు.

కోల్‌స్కామ్‌ కేసులో ఏప్రిల్‌ 8న తమ ముందు హాజరుకావాల్సిందిగా మన్మోహన్‌ సింగ్‌తో పాటు మరో ఐదుగురిని సీబీఐ కోర్టు ఆదేశించింది. సీబీఐ కోర్టు ఆదేశాలను నిలిపివేయాలంటూ మన్మోహన్‌ తన పిటిషన్‌లో కోరారు. యూపీఏ హయాంలో బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అందులో పాత్ర ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కింది కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. దాంతో మన్మోహన్‌ సింగ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే సచ్చీలుడిగా ఖ్యాతి గడించిన మన్మోహనుడికి కోర్టు నోటీసులు అందడంతోనే కాంగ్రెస్ మండిపడింది. అయనకు మద్దతుగా ర్యాలీ నిర్వహించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manmohan Singh  Supreme Court  court order  coal scam  

Other Articles