ttdp | media point | police

Police stoped the telangana tdp leaders at t assembly media point

telangana, assembly,ttdp, telanagana tdp, errebelli, revanthreddy

police stoped the telangana tdp leaders at T.assembly media point. telangana telugudesam party leaders were opposed by the police officials at telangana assembly. errabelli dayakar oppose the police action at media point.

మీడియా పాయింట్ వద్ద టిటిడిపి నేతలను అడ్డుకున్న పోలీసులు

Posted: 03/25/2015 12:57 PM IST
Police stoped the telangana tdp leaders at t assembly media point

తెలంగాణ మీడియా పాయింట్‌ వద్దకు వస్తున్న టీటీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సండ్ర వెంకటవీరయ్య, రేవంత్ రెడ్డి, వివేక్ గౌడ్, రాజేందర్ రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరమని ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఆరోపించారు. మీడియా పాయింట్  వద్ద పోలీసులు అడ్డుకోవడం ఏంటని ఎమ్మెల్యే సండ్ర ప్రశ్నించారు. తాము ఏ తప్పు చేయలేదని, అయినా సభ నుంచి సస్పెండ్‌ చేశారని  ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. తప్పు చేయకపోయినా శిక్షను అనుభవిస్తున్నామన్నారు. తాము తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచామని, తమను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
 
తెలంగాణ స్పీకర్‌ భయపడుతున్నారని,  ప్రభుత్వం స్పీకర్‌ గొంతును నొక్కేస్తోందని ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. దీనిపై గద్దర్‌, కోదండరామ్‌, విమలక్క, అల్లం నారాయణ లాంటి వారు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ గుండాల తీరుపై ఎందుకు నోరు విప్పడం లేదని నిలదీశారు. కెసిఆర్ ప్రభుత్వం అవలంబిస్తోన్న వైఖరి ఎమర్జెన్సీ రోజులు, రజాకార్ల పాలన మళ్లీ గుర్తు చేస్తోందని ఎర్రబెల్లి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయారని, కానీ అందులో 400 మందే గుర్తుకు వచ్చారా అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. పాపం తెలంగాణ అసెంబ్లీ నుండి తమను ఎలాగో వెళ్లగొట్టారు కనీసం మీడియా పాయింట్ వద్దనైనా మాట్లాడనివ్వలేదని తెలంగాణ తెలుగుదేశం తమ్ముళ్ల బాధను పాపం ఎవరు మాత్రం తీరుస్తారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  assembly  ttdp  telanagana tdp  errebelli  revanthreddy  

Other Articles