ప్రముఖ నటి జయసుధ తను అద్యక్షురాలిగా ఉండాలని కోరుకున్నారని, మహిళకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అద్యక్షపదవి ఇవ్వాలని అబిప్రాయపడ్డారని ప్రముఖ నటుడు,రాజమండ్రి ఎమ్.పి మురళీమోహన్ అన్నారు. తనకన్నా, అద్యక్ష పదవికి పోటీచేస్తున్న రాజేంద్ర ప్రసాద్ కన్నా సీనియర్ నటి జయసుధ అని ఆయన చెప్పారు.
చిరకాలంగా మా అధ్యక్షుడిగా వుంటూ వస్తున్న మురళీ మోహన్ ఈసారి కూడా పరోక్షంగానైనా మా పై ఆధిపత్యం వదులుకోరాదని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? సీనియర్ నటుడిగా, హీరోగా గతంలో ఓసారి ఓడిపోయిన రాజేంద్ర ప్రసాద్ తాను అధ్యక్షుడిగా వుండాలనుకుంటున్నని బాహాటంగా చెప్పినా కూడా ఎందుకు సమ్మతించలేకపోతున్నారు. అంటే తెలుగు సినిమా కళాకారులంతా ఒకటే అన్నది ఒట్టి మాటేనా? వారిలో వారికే సరిపడదా? వారిలో పార్టీ బేధాలు కూడా వున్నాయా? ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
ఆమె ఎంతో సీనియర్ నటి అని... చాలా ఏళ్లుగా ఆమె సినిమాల్లో నటిస్తూ సినీరంగానికి సేవ చేశారని ఆయన గుర్తు చేశారు. తాము ప్రతిపాదిస్తున్న బృందంలో స్ర్తీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వగలిగినప్పటికీ అవతలి వ్యక్తులు మాత్రం స్ర్తీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. జయసుధ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారని అన్నారు. జయసుధ తరపున మురళీమోహన్ ప్రచారం ఆరంబించారనుకోవచ్చు..
రాజేంద్ర ప్రసాద్ ‘ మా’ అధ్యక్షపదవి కి తాను పోటీ చేస్తున్నానని మీడియా సమావేశం పెట్టి వెల్లడించిన తరువాత మురళీ మోహన్ - ‘ ఆయనకు అప్పుడే ఆ స్థాయి (మా అధ్యక్ష పదవి చేపట్టే) వచ్చిందా’ అని మురళీ మోహన్ కొందరితో అన్నట్లు, అందుకే రాజేంద్ర ప్రసాద్ తరువాత కొందరికి ఇంటర్వూ ఇచ్చినపుడు ఈ స్థాయి..అనే పదాన్ని నొక్కి నొక్క మరీ చెప్పారట. అంతే కాదు ఆఫ్ ది రికార్డుగా మురళీమొహన్ మాటలు కూడా చెప్పి, బాధపడినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more