chandamama kathalu | 62nd National Film Awards

Chandamama kathalu telugu movie won 62nd national film awards as best regional movie

National Awards movies, 62nd National Film Awards, chandamama kathalu movie, kangana ranaut, queen movie, 62nd National Film Awards list

chandamama kathalu telugu movie won 62nd National Film Awards as best regional movie : Manchu Lakshmi Starrer chandamama kathalu has won national award as best telugu regional movie.

‘చందమామ కథలు’ మూవీకి ‘ఉత్తమ తెలుగు చిత్రం’గా జాతీయ అవార్డు

Posted: 03/24/2015 06:34 PM IST
Chandamama kathalu telugu movie won 62nd national film awards as best regional movie

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులైన జాతీయ అవార్డుల కమిటీ 2014 సంవత్సరానికిగాను తాజాగా జాబితాను ప్రకటించింది. ఈ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘చందమామ కథలు’ సినిమా ఎంపికైంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మంచులక్ష్మీతోపాటు ఇతర సినీ ప్రముఖులు, యువ నటీనటులు నటించారు. గత సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

ఎనిమిది భిన్న నేపథ్యాల్లోని ఎనిమిది కథలను అద్భుతమైన భావోద్వేగాలతో ఒక సినిమాగా తీయడమే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అదే ఈ సినిమాకు జాతీయ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికయ్యేలా చేసింది. బాక్సాఫీస్ దగ్గర అంతగా మాయాజాలం చూపించిన ఈ సినిమా.. జాతీయ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఎన్నికవ్వడంపై విశేషంగా భావిస్తున్నారు. ఈ అవార్డు లభించడంతో ఆ మూవీ యూనిట్ తోపాటు టాలీవుడ్ హర్షం వ్యక్తం చేస్తోంది.

queen-movie-stills

ఈ జాతీయ అవార్డుల్లో భాగంగా ఇతర భాషాచిత్రాలు ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటీనటుల, ఇతర కేటగిరికీ సంబంధించినవారి పేర్లను కూడా వెల్లడించడం జరిగింది. మే 3వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా ఈ పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది.

ఉత్తమ తెలుగు చిత్రం        - చందమామ కథలు
ఉత్తమ నటుడు        - కన్నడ నటుడు సంచారి విజయ్ (నాను అవనల్ల అవలు)
ఉత్తమ నటిగా        - కంగనా రనౌత్ (క్వీన్)
ఉత్తమ జాతీయ చిత్రంగా        - క్వీన్
ఉత్తమ మరాఠీ చిత్రం         - కిల్లా
ఉత్తమ కన్నడ చిత్రం         - హరివు
ఉత్తమ బెంగాలీ చిత్రం        - నిర్వాసితో
ఉత్తమ యానిమేషన్ చిత్రం     - సౌండ్ ఆఫ్ జాయ్
ఉత్తమ గాయకుడు        - సుఖ్వీందర్ సింగ్
ఉత్తమ కొరియోగ్రఫీ        - హైదర్
ఉత్తమ సంగీతం        - హైదర్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్         - డాలీ అహ్లువాలియా (హైదర్)
ఉత్తమ సంభాషణ        - హైదర్
ఉత్తమ చిత్రంగా        - కోర్ట్ (మరాఠీ)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం     - మేరీ కోమ్ (బాక్సర్ మేరీకోమ్ జీవిత కథ)
ఉత్తమ దర్శకుడు        - శ్రిజిత్ ముఖర్జీ (బెంగాలీ దర్శకుడు)
ఉత్తమ సహాయనటుడు         - బాబీ సింహ (జిగార్తాండ)
ఉత్తమ సహాయనటి         - బల్జిందర్ కౌర్ (పగ్డీ ద హానర్)(హర్యాన్వీ)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 62nd National Film Awards  kangana ranaut  chandamama kathalu movie  

Other Articles