A320 | crash | france

Germanwings plane crashes in southern french alps

A320, crash, Lufthansa, Germanwings, France, Barcelona

Germanwings plane crashes in southern French alps

కూలిన A320 విమానం.. 150 మంది గల్లంతు

Posted: 03/24/2015 05:21 PM IST
Germanwings plane crashes in southern french alps

లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ బస్ 320 విమానం కూలిపోయింది. జర్మని ఎయిర్ లైన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిర్ బస్ 320 విమానం బార్సిటోవా నుండి బయలుదేరగా మార్గ మధ్యలో కూలిపోయింది. అందులో 142 మంది ప్యాసింజర్లు, ఇద్దరు పైలెట్లు, నలుగురు సిబ్బంది ఉన్నారని సమాచారం. ఈ ఘటనపై  జర్మనీ పిఎం మ్యానువల్ వాల్స్ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అయితే ప్రమాదానికి కారణాలు తెలియలేదని మ్యానువల్ వాల్స్ తెలిపారు. నైస్ నగరానికి దాదాపు 65 మైళ్ల దూరంలో ప్రమాదం జరిగిందని సమాచారం. ఎయిర్ బస్ ఎ320 గత 24 సంవత్సరాలుగా సేవలను అందిస్తోంది. లుఫ్తాన్సా గ్రూప్ లో 1991 నుండి ఎ320 సేవలను అందిస్తోంది. అయితే ఎయిర్ బస్ 38 వేల ఫీట్ల ఎత్తులో ఉండగా అకస్మాత్తుగా కిందకి జారిందని, భూమికి దాదాపుగా 6,800 ఫీట్ల ఎత్తులో ఉండగా సిగ్నల్ కోల్పోయిందని సమాచారం.

lufthansa-twet

ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హోలాండ్ దీనిపై స్పందించారు. మా భూభాగంలో జరిగిన అతి పెద్ద ట్రాజడీ అని ఫ్రాంకోయిస్ హోలాండ్ తెలిపారు. మరోపక్క ఘటనపై జర్మని ఛాన్స్ లర్ ఏంజిలా మార్కెల్ తోనూ తాను మాట్లాడినట్లు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వెల్లడించారు. అక్కడి స్థానిక సమయం ప్రకారం 9. 45 నిమిషాలకు క్రాష్ జరిగి ఉంటుందని సమాచారం. అయితే క్రాష్ జరిగినట్లు 9 గంటల 47 నిమిషాలకు సమాచారం అందింది. భారత కాల మానం ప్రకారం 4 గంటల 45 నిమిషాలకు క్రాష్ జరుగగా, 5గంటలకు సమాచారం అందిందని అర్థం. మరో పక్క లుఫ్తాన్సా విమానం కూలిన వార్త బయటికి వచ్చిన వెంటనే లుఫ్తాన్సా షేర్ల వాల్యు భారీగా పతనమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : A320  crash  Lufthansa  Germanwings  France  Barcelona  

Other Articles