chandrababu, ap, power, electricity, hike, assembly

Ys jagan mohan reddy challenge to ap cm chandrababu naidu

ys jagan, chandrababu, ap, power, electricity, hike, assembly, coal rate, ys raashekarreddy,central govt, resignation, crisil rating

ys jagan mohan reddy challenge to ap cm chandrababu naidu. in ap assembly ysrcp leader jagan challenge the ap cm chandrababu naidu for resignation if the statistics about the power. ap cm chandrababu naidu raise the power unit rate highly in ap. the ap govt got power from central govt. but the state govt raised the power unit hike jagan oppose this issue.

చంద్రబాబు.. రాజీనామాకు సిద్దమా: జగన్

Posted: 03/24/2015 01:20 PM IST
Ys jagan mohan reddy challenge to ap cm chandrababu naidu

విద్యుత్ ఛార్జీల పెంపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్కటి అబద్ధాలతో కథలు చెప్పారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. గతంలో చంద్రబాబు తన తొమ్మిదేళ్ల కాలంలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై చంద్రబాబుతో తాను చర్చకు సిద్ధమన్నారు.  తాను చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

 విద్యుత్ ఛార్జీల పెంపును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైయస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు.   బొగ్గు రేట్లు 102 డాలర్ల నుంచి 60 డాలర్లకు తగ్గాయని, అలాంటప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరమే లేదని ఆయన అన్నారు. చార్జీల పెంపులో హేతుబద్ధత లేదని, కేంద్రం అదనపు విద్యుత్ ఇస్తుంటే విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారని వైఎస్ జగన్ ప్రశ్నించారు.  ఏ రాష్ట్రంలోనూ లేని విద్యుత్ ఛార్జీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయన్నారు.  వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు అద్భుతమైన క్రిసిల్ రేటింగ్ వచ్చిందని కానీ చంద్రబాబు ప్రసంగంలో ఆ విషయమే ప్రస్తావించలేదని జగన్ తెలిపారు. తన లెక్కలు తప్పని తేలితే రాజీనామా చెయ్యడానికి సిద్దమా అని జగన్ చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. మరి చంద్రబాబు ఈ సవాల్ పై ఎలా స్పందిస్తారో.. కానీ మొత్తానికి చంద్రబాబుకు విద్యుత్ మంటలు బాగానే తగులుతున్నాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan  chandrababu  ap  power  electricity  hike  assembly  coal rate  

Other Articles