Some blank calls from canada to anna hazare

anna hazare, anna, calls, warning, canada, fake calls,

some blank call from canada to anna hazare. most famous social worker anna hazare warned by unknown presons by fake phone calls, some unknown persons called to anna from canada.

గాంధీని చంపినట్లే నిన్నూ చంపేస్తాం

Posted: 03/23/2015 04:14 PM IST
Some blank calls from canada to anna hazare

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారేకు నేటి గాంధీ అని చాలా మంది సంబోధిస్తుంటారు. గాంధీ చూపిన బాటలోనే అన్నా హజారే కూడా పయనిస్తు ఎంతో మంది అభిమానులను సంపాదించారు. లోక్ పాల్ బిల్లు కొసమైతే పెద్ద యుద్దమే చేశారు. ప్రభుత్వం ఎలాగైనా లోక్ పాల్ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదం పొందేలా చొరవచూపాలని భారీగా ఉద్యమాన్ని నిర్వహించారు. అయితే ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది కార్యకర్తలు అన్నా హజారేకు బాసటగా నిలిచారు. అయితే తాజాగా భూసేకరణ చట్టంపై కూడా ప్రభుత్వంపై ఉద్యమానికి దిగారు. ఎన్డీయే ప్రభుత్వం తేవాలనుకుంటున్న భూసేరణ చట్టాన్ని అన్నా హజారే పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

ప్రజల తరఫున ఉద్యమాల బాట పట్టిన అన్నా హజారేకు ఎంతో మద్దతు లబిస్తోంది. ఏ పని చేస్తున్నా అనుకోకుండానే మనకు మిత్రులు, శత్రువులు పుట్టుకొస్తారు. అలాగే అన్నా హజారేకు ఎంతో మంది అభిమానులు, అనుచరులతో పాటు కొంత మంది శత్రువులు కూడా తయారయ్యారు. అన్నా హజారే ఉద్యమాన్ని ఆపకపోతే చంపేస్తామని ఆకతాయిలు ఫోన్ లు చేశారు. దాంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అయితే తాజాగా మరో సారి అన్నా హజారే ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఈ సారి బెదిరింపుల్లో ఎలా చంపుతారో కూడా వివరించారు. గాంధీని గాడ్సే చంపినట్లే అన్నా హజారేను చంపేస్తామని కెనడా నుండి కాల్స్ వచ్చాయి. దీన్ని అన్నా హజారే స్వయంగా వెల్లడించారు. అయితే పోలీసులకు దీనిపై అన్నా హజారే ఫిర్యాదు చేశారా లేదా వదిలేశారా అని తెలియలేదు. మరి ఉద్యమాలు చేస్తే చంపేస్తామని హెచ్చరించడం భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో ఎంత మాత్రం సమ్మతించేది కాదు. మరి ప్రభుత్వం అన్నా హజారే లాంటి సామాజిక కార్యకర్తలకు ఎలాంటి భద్రతను కల్పిస్తుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anna hazare  anna  calls  warning  canada  fake calls  

Other Articles