Ysrcp mla roja fire on tdp and speaker at assembly sessions

roja, ysrcp, tdp, chandrababu, balakrishna, ntr, jagan,l bonda uma, peethala sujatha

ysrcp mla roja fire on tdp and speaker at assembly sessions. ysr mla, cinema star roja once again fire on tdp. she said that speaker didnot behave transperent at assembly sessions. she fire on ap assembly speaker kodela. she also said that if anybody insult, ntr, balakrishna also insulted.

రోజమ్మా ఎన్టీఆర్, బాలకృష్ణలను ఎందుకు లాగుతావమ్మా..?

Posted: 03/23/2015 02:16 PM IST
Ysrcp mla roja fire on tdp and speaker at assembly sessions

ఏపి అసెంబ్లీ తన మాటల తూటాలతో ప్రకంపనలు పుట్టించిన రోజా ఇంకా తన మాటలను ఇంకా ఆపడం లేదు. స్పీకర్ ను ఓ ఫ్యాక్షనిస్టు అని సంబోధించిన రోజా తాజాగా మరో సారి స్పీకర్ పై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు వైఖరిపై కూడా రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ తరఫున జగన్ తరువాత చంద్రబాబు, ఏపి సర్కార్ పై రోజా ఈటెల్లాంటి మాటలతో దాడికి దిగారు.

అసెంబ్లీలో తనను ఎదుర్కోలేకే టీడీపీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. తమ సభ్యులను అవమానపరిచిన చంద్రబాబు, దేవినేని ఉమా తదితరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టబోతున్నామని ఆమె తెలిపారు. అసెంబ్లీ తమ ఆస్తి అని ఎవరికి ఏం జరిగినా మెజారిటీ అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకోవాలన్నారు. అసెంబ్లీ నుంచి తనను తరిమేయాలని చూస్తున్నారని రోజా ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న స్పీకర్ పై మరోసారి నోరు పారేసుకుంది రోజా. 67 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఉద్దేశించి చంద్రబాబు, పిచ్చి పిచ్చిగా ఉందా మీ అంతు చూస్తా అని వార్నింగ్ ఇచ్చారని దీనిపై స్పీకర్ చర్య తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు. సినీ రంగం నుండి వచ్చిన తనను అవమానిస్తే అదే రంగం నుండి వచ్చిన ఎన్టీఆర్, బాలకృష్ణలను కూడా అవమానించినట్లే అని రోజా అన్నారు. మొత్తానికి పాపం ఎన్టీఆర్ ను, బాలకృష్ణను కూడా తన వివాదంలోకి లాగింది. అయితే ఎటు తిరిగినా రోజా తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ గా చేస్తోంది. బోండా ఉమ పాతరేస్తానని అన్నా, పీతల సుజాత తన కాలి గోటికి కూడా సరిపోనని అన్నా స్పీకర్ వారిపై చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. మొత్తానికి ఓ పక్క స్పీకర్ ను తిడుతూనే, చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేస్తోంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : roja  ysrcp  tdp  chandrababu  balakrishna  ntr  jagan  l bonda uma  peethala sujatha  

Other Articles