Jaganmohanreddy fires on chabdrababu naidu

jagan, media, lotuspond, pressmeet, chandrababu, ap, budget

jaganmohanreddy fires on chabdrababu naidu. ys jagan fire on babu and his govts budget. he said that babu did not coplete the promise to the farmers.

అంతా ఆయనే చేశాడు.. మీడియా ముందు జగన్

Posted: 03/20/2015 01:14 PM IST
Jaganmohanreddy fires on chabdrababu naidu

వైయస్ఆర్ కాంగ్రెస్ నేత వైయస్ జగన్ తమ సభ్యుల సస్పెన్షన్ పై గుర్రుగా ఉన్నారు. ఏపి అసెంబ్లీ పై అవిశ్వాసానికి పూనుకున్నారు. అయితే అవిశ్వాసంపై తమకు చర్చించే అవకాశాన్ని కల్పించకపోతే, సభలోకి అడుగుపెట్టబోమని జగన్ పట్టుపట్టారు. దాంతో జగన్ తన లోటస్ పాండ్ గెస్ట్ హౌజ్ లో మీడియా సమావేశాన్ని నిర్హించారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు ఒకమాట, సీఎం అయిన తర్వాత మరోలా మాట్లాడారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎప్పుడైనా రుణమాఫీపై ఆంక్షలు గురించి మాట్లాడారా అని ఆయన  ప్రశ్నించారు.

చంద్రబాబుకు ఇక్కడే రేషన్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కూడా  ఉండొచ్చు. ఇక్కడే అన్ని తీసుకుని ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అవుతారు. కానీ హైదరాబాద్లో ఉన్న రైతుకు మాత్రం రుణమాఫీ చేయరు.  యాభైవేలు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నాడని జగన్ విమర్శించారు. హైదరాబాద్లో ఉద్యోగమో, సద్యోగమో చేసుకుంటున్నవారికి రుణమాఫీ ఇవ్వమని చంద్రబాబు ఎప్పుడైనా చెప్పారా? హైదరాబాద్లో ఉంటున్న రైతులకు రుణమాఫీ ఇవ్వడానికి మనసు రాదని అన్నారు. మొత్తానికి జగన్ సభకు హాజరుకాకుండా మీడియా ముందు తన గొంతును వినిపించారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagan  media  lotuspond  pressmeet  chandrababu  ap  budget  

Other Articles