Bc welfare union president r krishniah attacked on trs and kcr

r.krishniah, kcr, trs, elections, mlc,

bc welfare union president r krishniah attacked on trs and kcr. r. krishniah said that in this mlc elections people got the chance to defeat kcr by voting to bjp mlc candidate.

కెసిఆర్ కు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి

Posted: 03/20/2015 09:32 AM IST
Bc welfare union president r krishniah attacked on trs and kcr

ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాక్ ట్రీట్‌మెంటు ఇస్తేనే కెసిఆర్ భూమి మీదకు దిగొస్తారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అన్నివర్గాలను మోసం చేసిన సీఎం కేసీఆర్ విమానాల మీద గాలిలో తిరుగుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్ ఎవరినీ లెక్కచేయడం లేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ పబ్లిక్ కమీషన్ ఏర్పాటుకాగానే ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను, విద్యార్తులను మోసం చేశారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్‌కు బుద్ధిచెప్పే అవకాశం వచ్చిందన్నారు. ప్రలోభాలకు లొంగకుండా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కృష్ణయ్య కోరారు. మరి తెలంగాణ సిఎం కెసిఆర్ కు షాక్ ట్రీట్ మెంట్ ఇస్తారో లేక టిడిపి- బిజెపి అభ్యర్థిని ఓడించి క్రిష్ణయ్యకే షాక్ ఇస్తారో వేచి చూడాలి. ఆ ఫలితాలు తెలియాలంటే కాస్త వేచి ఉండక తప్పదు మరి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : r.krishniah  kcr  trs  elections  mlc  

Other Articles