Telanagana telugudesam leaders may propose to confidence motion

telanagana, assembly, speaker, madhusudhanachary, trs, ttdp, errebelli, revanthreddy, janareddy

telanagana telugu desam party leaders may propose to confidence motion. ttdp leaders very anger on t. speaker for his behaviour in telanagana assembly. ttdp leaders errebelli dayakar rao, revanth reddy met jana reddy on proposal of confidence motion.

టి. స్పీకర్ పై అవిశ్వాసానికి టిటిడిపి సిద్దం

Posted: 03/20/2015 09:07 AM IST
Telanagana telugudesam leaders may propose to confidence motion

తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని తెలంగాణ టిడిపి నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, ఉపనేత రేవంత్‌రెడ్డి  సీఎల్పీ నాయకుడు జానారెడ్డిని కలిశారు. శాసనసభలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న కీలక సమయం లో ఒకసెషన్ మొత్తం, ఒక పార్టీని ఏకపక్షం గా సస్పెండ్ చేయడం చరిత్రలో ఎక్కడా లేదని వివరించినట్టుగా సమాచారం. పార్టీ ఫిరాయింపులు, మంత్రిగా తలసాని  కొన సాగింపుపై తాము ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోవడం లేదని, ఇందుకు నిరసనగా అవిశ్వాస తీర్మానంపై నోటీసివ్వాలని భావిస్తున్నట్లు  తెలిసింది.  ఇదే విషయంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు చర్చించారు.
 
అయితే తెలంగాణ స్పీకర్ పై టిటిడిపి నేతలు అవిశ్వాసం ప్రవేశపెట్టే అవకాశాలు గట్టిగానే ఉన్నా అది వీగిపోయేందుకు ఎక్కువగా అవకాశాలున్నాయి. సభలో టిఆర్ఎస్ నాయకుల బలం ఎక్కువగా ఉండటం, ఏకంగా స్పీకర్ పై అవిశ్వాసానికి ఎంత మంది ప్రతిపక్ష నాయుకులు మద్దతిస్తారన్నది ప్రశ్న. అయితే తెలుగుదేశం ఎమ్మెల్యేలను మొత్తం సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం సబబు కాదని, వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ సభ్యులు గతంలోనే స్పీకర్‌ను కలిశారు. కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, బీజేపీ ఎల్పీనేత డాక్టర్ లక్ష్మణ్, సీపీఎం, సీపీఐ ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, రవీంద్రకుమార్‌లు స్పీకర్‌ను కలసి చర్చించారు. అయితే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నుండి ఏమాత్రం అనుకూలంగా స్పందన రాకపోవడంతో అతడిపై అవిశ్వాసానికి సిద్దపడుతున్నారు టిటిడిపి నేతలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telanagana  assembly  speaker  madhusudhanachary  trs  ttdp  errebelli  revanthreddy  janareddy  

Other Articles