Mass copying gets adventurous in bihar

Mass copying gets adventurous in Bihar, Mass copying in sslc examinations in Bihar, SSLC examinations mass copying in bihar, SSLC examinations mass copying in patna, SSLC examinations mass copying in bihar,

Belying Nitish Kumar-led Government’s claim that there was no mass copying in the SSLC examinations, thousands of outsiders helped the boys and girls taking examinations.

10 క్లాస్ పరీక్షల్లో మాస్ కాఫీయింగా..? ఎక్కడ..? ఇదికాదా..!

Posted: 03/19/2015 09:00 PM IST
Mass copying gets adventurous in bihar

బీహార్ లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న క్రమంలో విద్యార్థులు మాస్ కాఫీయింగ్ కు పాల్పడుతున్నారన్న ఆరోఫణలు వెల్లువెత్తుతున్న క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. ఎక్కడ..? మాస్ కాఫీయింగ్ ఎక్కడ...? జరుగుతుంది.. అదంతా ఏమీ లేదు.. పరీక్షలన్నీ సజావుగానే సాగుతున్నాయి. విద్యార్థులు ఎక్కడ మాస్ కాపీయింగ్ కు పాల్పడటం లేదని కుండబద్దలు కోట్టినట్టు చెప్పారు. అయితే స్వయంగా ముఖ్యమంత్రే చెబుతుంటే అందులో నిజముందనని అందరూ భావించారు. ఎక్కడో ఒక చోట అలాంటి ఘటనలు జరుగుతాయి కదా అనుకుని హాజీపూర్ లోని ఓ పరీక్షా కేంద్రానికి వెళ్లిన మీడియాకు అసలు ఇలా కూడా కాఫీయింగ్ చేస్తారా..? అన్న సందేహాలు తలెత్తాయి. ఇక ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాటలకు.. పరీక్షా కేంద్రంలో జరుగుతున్న చేతలకు అస్సలు పోలికే లేదు.

మీకు నమ్మకం కలగడం లేదా..? అయితే ఈ ఫోటో ను ఒక్కసారి తీక్షణంగా పరిశీలించండి.. వీళ్లంతా భవన నిర్మాణ కార్మికులు కారు. అది నూతనంగా కడుతున్న భవనమూ కాదు. అది పదో తరగతి పరీక్షా కేంద్రం. అక్కడ కిటికీలకు గబ్బిలాలుగా వేలాడుతున్నది పరీక్ష రాస్తున్న విద్యార్థుల తండ్రులు. ఎంతో సాహసోపేతంగా భవనంపైకి ఎక్కి మరీ తమ పిల్లలకు చిటీలను అందజేసి పరీక్షలను అద్బుతంగా రాయిస్తున్నారు. ఇదే శ్రమ రోజు ఇంటి వద్ద చదివించడంలో వుంటే ఇప్పడిలా.. ఇంతలా వ్యవప్రయాసలు పడాల్సి వచ్చేందా..? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలను అబద్దం అనాల్సి వచ్చేదా..?

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitish Kumar  mass copying  SSLC examinations  

Other Articles