Parliamentary affairs minister venkiah naidu attacked on congress for special status for ap

venkiah naidu, ap, special status, parliament, chandrababu, congress

parliamentary affairs minister venkiah naidu attacked on congress for special status for ap. in the paeliament sessions venkiah naidu clear that ap need the special status.

తూచ్.. వాళ్లు చేసింది తొండి.. ఇవ్వాల్సిందే!

Posted: 03/19/2015 03:58 PM IST
Parliamentary affairs minister venkiah naidu attacked on congress for special status for ap

ఇదేంటి చిన్నప్పుడు ఎప్పడో విన్న మాట అనుకుంటున్నారా..మరి చెబుతున్న అంశం అలాంటిది మరి. ఏపి విభజన తరువాత అవశేష ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా గురించి రోజుకో వార్త ముందుకు వస్తోంది. ఓ రోజు ప్రత్యేక హోదా కేంద్రం పరిశీలనలో ఉందని.. మరో రోజు అసలు కుదరదు అని ఇలా ఒకదానికొకటి భిన్నంగా ఎలాంటి సంబందం లేకుండా వార్తలు వస్తున్నాయి. అయితే కేంద్ర కేబినెట్ లో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్న తెలుగోడు మన వెంకయ్య నాయుడు ఖచ్చితంగా ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తాడని అందరూ ఆశించారు. అయితే వెంకయ్య నాయుడు మాత్రం అది కుదరదు అంటూ దాదాపుగా తేల్చారు.

అయితే తాజాగా మరొ సారి ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని, అందుకు ఎంతో కృషి చేస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ఇలా ఒకే వ్యక్తి రెండు మూడు రకాలుగా మాట్లాడటం విశేషం. మరో పక్క కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వాళ్లు చేసిందేమీ లేదని, అన్నీ హామీలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా గురించి చేర్చనే లేదని, కానీ ఇప్పుడు మాత్రం తమ పార్టీ మీదే బురదజల్లుతున్నారని మండిపడ్డారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రం ఎంతో ప్రయత్నిస్తోందని అన్నారు. అసలు వెంకయ్య నాయుడు ఏం మాట్లాడుతున్నారో.. ఇప్పటికి కొందరికి అంతుబట్టడం లేదు. సరే అయిందేదో అయింది కనీసం ఇప్పటికైనా ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తే మంచిది అని చాలా మంది ఆశిస్తున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkiah naidu  ap  special status  parliament  chandrababu  congress  

Other Articles