Bangladesh trying hard to chase indian target

India versus Bangladesh, India vs Bangladesh, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, bangaldesh, India, Australia, pakistan, newzealand, west indies, bangaldesh, bangaldesh CWC 2015, Live Scores, Live Updates, India, India CWC 2015, Sports, World Cup Live

bangladesh trying hard to chase indian target

40 ఓవర్లకు 168 పరుగులు సాధించిన బంగ్లా

Posted: 03/19/2015 04:46 PM IST
Bangladesh trying hard to chase indian target

ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా నాకౌట్ ధశలో మెల్ బోర్న వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండవ క్వార్టర్ ఫైనల్ లో బంగ్లదేశ్ నిలకడగా రాణిస్తోంది. ధోణి సేన నిర్ధేశించిన 303 పరుగల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 40 ఓవర్లలలో ఆరు విక్కెట్లు నష్టపోయి 168 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజ్ లో సాబిర్, నాసిర్ లు నిలకడగా అడుతున్నారు. ఆదిలోనే రెండు విక్కట్లను కొల్పోయి కష్టాలలో పడిన బంగ్లా ఆ తరువాత పాతిక ఓవర్లలోపు నాలుగు విక్కట్లను నష్టపోయింది. ఆ తరువాత మరో రెండు వికెట్లను నష్టపోవడంతో బంగ్లాదేశ్ కష్టాలలో పడింది. గెలుపు కోసం కేవలం పది ఓవర్లలో మరో 135 పరుగులు సాధించాల్సిన అవశ్యకత ఏర్పడింది.

విజయలక్ష్యాన్ని చేధించే పనిలో ఓపెనర్ తమీమ్ ధాటిగా ఆడి భారత బౌరర్లకు చమటలు పట్టించాడు. 25 బంతులను ఎదుర్కోన్న తమీమ్ నాలుగు ఫోర్ల సాయంతో 25 పరుగులు సాధించి ఉమేష్ యాదవ్ వేసిన షాట్ బాల్ పుల్ చేసి ఆడే క్రమంలో బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అ వెనువెంటనే లేని పరుగు కోసం పరిగెత్తి ఇమ్రుల్ కేస్ అవుటయ్యాడు.  ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన సౌమ్య సర్కార్ కూడా ధాటిగా ఆడాడు 43 బంతులను ఎదుర్కోని ఒక ఫోరు, ఒక సిక్స్ సాయంతో 29 పరుగులు సాధించాడు. చివరకు 29 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. మహ్మదుల్లా కూడా ధాటిగా అడుతూ 21 పరుగుల వద్ద బౌండరీలో వున్న శిఖర్ ధావన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన షకీబ్ పది పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద అవుటవ్వగా, రహీమ్ 27 వ్యక్తిగత పరుగులు వద్ద పెవీలియన్ కు చేరాడు. దీంతో ఆరు వికెట్లు నష్టపోయిన బంగ్లా.. నిదానంగా ఆడుతోంది. ప్రస్తుతం క్రీజ్ లో సాబిర్, నాసిర్ కోనసాగుతున్నారు. భారత బౌలర్లలో షమి, ఉమేష్ రెండేసి విక్కెట్లను తీయగా, జెడేజా కు ఒక్క వికెట్ దక్కింది.

 

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  India  bangaldesh  

Other Articles