Rahul gandhi may follow rajinikanths words

rajinikanth, rahul gandhi, leave, congress, sonia gandhi, rally, footmarch

rahul gandhi went for holiday trip since parliament sessions begin. the aicc president didnt gave clarity on the rahul leave. now the congress leader hope that rahul gandhi will come soon with latest entry by folloing rajinis dialouge.

రజినీ మాటలను ఫాలో అవుతున్న రాహుల్..!

Posted: 03/18/2015 05:10 PM IST
Rahul gandhi may follow rajinikanths words

లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడు- అని సూపర్ స్టార్ రజినీ కాంత్ సినిమాలో ఓ ఫేమస్ డైలాగ్ ఉంది. అయితే రజీనీ డైలాగ్ మాకు ఎంతో అవసరం అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. అదేంటి రజినీకాంత్ కు కాంగ్రెస్ తో సంబందం ఏంటని అనుకుంటున్నారా.. రజినీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉంటారని అందరికి తెలుసు. అయితే రజినీకాంత్ సినిమాలోని డైలాగ్ మాత్రం కాంగ్రెస్ వారికి ఎంతో ఉపయోగపడుతోంది. ఇంతకీ ఆ డైలాగ్ కు కాంగ్రెస్ కు ఏంటి సంబందం గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే...

గత కొంత కాలంగా కనిపించకుండా పోయిన ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జాడ ఇప్పటి వరకు తెలియలేదు. మీడియా వారు రాహుల్ గురించి అడిగినా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నుండి కానీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుల నుండి కానీ ఎలాంటి సమాధానం రాలేదు. అయితే ఇప్పుడు అప్పుడు అంటూ కాలం మాత్రం వెల్లదీస్తున్నారు. అప్పుడెప్పుడో ములాయం యాదవ్ ఆరోగ్యం బాగోలేనప్పుడు, ఆయన కోలుకోవాలని రాహుల్ బాబు నుండి వర్తమానం అందింది. అంతే మరే సమాచారం లేదు.. మనిషీ లేడు.

అచితే తాజాగా రాహుల్ గాంధీ కొత్త అవతారంలో వస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతుండడం ఆసక్తికరంగా ఉంది. రాహుల్ జీవితంలో కొత్త అధ్యాయం ఆరంభం అవుతుందని ఆ వర్గాలు అంటున్నాయి.ఆత్మపరిశోధన పేరుతో రాహుల్ గాంధీ గత కొన్నాళ్లుగా అందరికీ దూరంగా ఉన్నారు మరో పదిహేను , ఇరవై రోజులలో రాహుల్ మళ్లీ జనజీవనంలోకి రావచ్చు.ప్రస్తుతం కాంగ్రెస్ పునరుద్దరణ అంశంపై ఆయన ఆలోచన సాగిస్తున్నారన్నది పార్టీ వర్గాల ప్రచారం. ఈ క్రమంలోనే ఆయన దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టవచ్చని చెబుతున్నారు. ఏప్రిల్ లో కాంగ్రెస్ పార్టీ పై పూర్తి నియంత్రణ తెచ్చుకుని కాంగ్రెస్ కు మళ్లీ కళ తెచ్చే కృషి చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరి మొత్తానికి రాహుల్ గాంధీ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తారో లేదో కొంత కాలానికి తేలిపోతుంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajinikanth  rahul gandhi  leave  congress  sonia gandhi  rally  footmarch  

Other Articles