Telanagana govt promise to farmers for their support

farmers, agriculture, pocharam, srinivasreddy, telangana

telanagana govt promise to farmers for their support. telanagana agriculture minister gave a statement in telanagana assembly on farmers death. he said that the govt will support the farmers.

రైతులకు బాసటగా తెలంగాణ ప్రభుత్వం

Posted: 03/17/2015 09:01 AM IST
Telanagana govt promise to farmers for their support

మరణించిన రైతు కుటుంబానికి లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా, ఒకేసారి రుణ పరిష్కారం కోసం 50వేల మొత్తాన్ని ప్రభుత్వం సమకూరుస్తుందని తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వారి పిల్లలకు సాంఘిక సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లలో అడ్మిషన్లు కల్పిస్తామన్నారు. ఐఏవై పథకం కింద గృహాల కేటాయింపు, ప్రభుత్వ పథకాల కింద ఆర్థిక మద్దతునిస్తామని వివరించారు.ఆత్మహత్యల నివారణకు వ్యవసాయ శాఖ ద్వారా తీసుకున్న చర్యలను ప్రభుత్వం సభ దృష్టికి తీసుకొచ్చింది. పంటకాలంలో వ్యవసాయ శాఖ ద్వారా, కెవికెల ద్వారా రైతులకు సలహాలు అందిస్తారన్నారు. పంట రుణాలు లభించే చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. రుణాలు సకాలంలో చెల్లిస్తే లక్ష వరకు వడ్డీలేని పంట రుణాలు, లక్షనుంచి మూడు లక్షల వరకు పావలా వడ్డీతో రుణాలు అందేలా చేస్తామన్నారు. లక్ష రూపాయల వరకు రుణ మాఫీ పథకం అమలు చేస్తున్నట్టు చెప్పారు.

కౌలుదారులకు రుణాలు అందించే ఏర్పాట్లు, పంటల బీమా పథకానికి గ్రామాన్ని ఒక యూనిట్‌గా చేసినట్టు తెలిపారు. పంటల బీమా కోసం ప్రభుత్వం ప్రీమియం సబ్సిడీని సమకూరుస్తుంది. రైతులకు విత్తనాలు సమకూర్చడానికి గ్రామ విత్తన పథకాన్ని అమలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలో 96మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రభుత్వం సోమవారం శాసన సభకు లిఖిత పూర్వక సమాధానంలో తెలిపింది. రైతుల ఆత్మహత్యలపై వివిధ పార్టీల సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రెవెన్యూ మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2 జూన్ 2014 నుంచి 28 ఫిబ్రవరి 2015 మధ్యకాలంలో 96మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : farmers  agriculture  pocharam  srinivasreddy  telangana  

Other Articles