Telanagana govt plans to provide she teams for all dists

she teams, hyderabad, eveteasing, telanagana, police, anuraj sharma

telanagana govt plans to provide she teams for all dists. telanagana police department plans to establish she teams to all telanagana dist.s. dgp anuraj sharma plan to dispach.

తెలంగాణ అన్ని జిల్లాలకు షీటీంలు

Posted: 03/17/2015 09:12 AM IST
Telanagana govt plans to provide she teams for all dists

ఈవ్‌టీజర్లు, రద్దీ ప్రాంతాలు, రోడ్లు, బస్టాప్‌లలో మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ మహిళాభద్రతకు భరోసా కల్పించడంలో షీ టీమ్స్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో షీటీమ్స్ చేపట్టిన కార్యక్రమాలతో ఈవ్ టీజింగ్ చాలా వరకు తగ్గింది. పట్టుబడ్డ వారికి కుటుంబ సభ్యులతో కౌన్సిలింగ్ ఇప్పించి కోర్టుకు తీసికెళ్లడం, బాధితురాలు ఫిర్యాదు ఇస్తే నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తుండడంతో షీటీమ్స్ అంటేనే పోకిరీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మహిళల భద్రతకు హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో ఏర్పాటైన షీ టీమ్స్ ఇక మీదట రాష్ట్రమంతటా తమ సేవలను విస్తరించనున్నాయి. షీ టీంలు ప్రవేశపోట్టినప్పటి నుండి హైదరాబాద్ పరిధిలో మంచి ఫలితాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. షీ టీమ్స్ నగర సారధి - నగర అదనపు పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా నేతృత్వంలో అన్ని జిల్లాల పోలీసు బృందాలకు ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో శిక్షణనివ్వనున్నారు. వీటిని వచ్చేనెల మొదటి వారంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రంగంలోకి దించేందుకు తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ చర్యలు చేపట్టారు. మొత్తానికి ఆడవారి రక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అందరు అభినందిస్తున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : she teams  hyderabad  eveteasing  telanagana  police  anuraj sharma  

Other Articles