Gang rape on mentally challenged orphan teen

gang rape on mentally challenged teen, gang rape on mentally challenged teen in maharastra Thane, Violence against women, Union minister of women and child development Maneka Gandhi, Violence against women in india, rape on women, sexual assault on woman, insult to modesty on woman, kidnapping woman, abduction of woman, cruelty by intimate partner or relatives on woman, trafficking of woman, persecution for dowry, woman dowry deaths, indecency towards woman, Rape most common crimes against women, crime on woman,

gang rape on mentally challenged orphan teen in maharastra Thane

మానసిక వికలాంగురాలిపై గ్యాంగ్ రేప్.. పాశవికం..

Posted: 03/16/2015 09:47 PM IST
Gang rape on mentally challenged orphan teen

మానసిక వికలాంగురాలన్న కనీస కనికరం, మానవత్వాన్ని మరిచిన మగ మృగాళ్లు అత్యంత పాశవిక చర్యకు పాల్పడ్డారు. పాఠశాల విద్యనభ్యసిస్తున్న మానసిక వికలాంగురాలిపై ఐదు మాసాలుగా వరుసగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అమె గర్భవతి కావడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో బాధితురాలి బంధువులు ఇచ్చిన పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అమెపై అత్యాచారానికి పాల్పిడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై నిర్భయ సహా పలు చట్టాల కింద కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని థానె పట్టణ సమీపంలోని నౌపడలో నివసించే గనేశ్ వాహ్(24), గనేశ్ బోర్డే(40) అనే ఇద్దరు వ్యక్తులు గత ఏడాది నవంబర్ నుంచి మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులను కోల్పోయిన అ బాలిక ప్రస్తుతం పిన్నీ బాబాయ్ ల వద్ద వుంటూ విద్యను అభ్యసిస్తోంది. అదే అదనుగా చేసుకున్న నిందితులు గత నవంబర్ నెలలో పాఠశాలకు వెళ్లొస్తున్న సదరు బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన నిర్మానుష్య ప్రాంతంలో అమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ రోజు నుంచి లైంగికదాడి కొనసాగించారు. ఎవరికైనా చెప్తే పరువు తీస్తాం, ప్రాణం తీస్తామంటూ బెదిరించారు. చివరికి ఈ విషయం బయటకు తెలియడంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : crime on woman  Rape  mentally challenged  

Other Articles