Cpm leader brinda karath fires on bjp

cpm leader brinda karath fires on bjp, cpm leader brinda karath, brinda karath questions tdp to give reply on special status to ap, brinda karath questions bjp to reply on special status, andhra pradesh special status, brinda karath on ap special status,

cpm leader brinda karath fires on bjp, asks tdp to give answer on special status to ap

బీజేపి మాట తప్పిందా..? లేదా..? టీడీపీయే చెప్పాలి.?

Posted: 03/16/2015 07:38 PM IST
Cpm leader brinda karath fires on bjp

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు బృందాకారత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశంలో మార్పులు తీసుకువస్తామన్న ప్రధాని.. వాగ్ధానాలను విస్మరించడంతోనే మార్పును తీసుకువస్తారా అని ప్రశ్నించారు. సీపీఎం జిల్లా సదస్సుకు అతిధిగా హాజరైన బృందాకారత్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన భూ సేకరణ చట్టం బ్రిటిష్ కాలం నాటి చట్టం కంటే దారుణంగా ఉందని అన్నారు.

బీజేపీతో పొత్తు చారిత్రాత్మక  తప్పిదమన్న చంద్రబాబు ఏ విధంగా పొత్తు పెట్టుకున్నారని బృందాకారత్ ప్రశ్నించారు. చంద్రబాబుది రెండు మాటలు, ద్వంద్వ వైఖరని ఆమె ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం బీజేపీ మాట తప్పడమే అన్నారు. ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించకపోవడం సమంజసమా అన్నది టీడీపీ ప్రభుత్వమే చెప్పాలని నిలదీశారు. నవ్యాంధ్ర రాజధాని పేరుతో వేల ఏకరాలను రైతుల నుంచి బలవంతంగా సేకరిస్తున్న ప్రభుత్వం అంత విస్తీర్ణంలో రాజధాని నిర్మాణం చేపడుతుందా అని ప్రశ్నించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CPM leader  Brinda karath  BJP  TDP  

Other Articles