Mother gave her child to icds for her povertry

mother, poverty, girl child, mahabubnagar, icds

mother gave her child to icds for her povertry. a mother who gave birth to a girl child in mahabubnagar dist. gave that child to icds in mahabubnagar. the mother family suffering from poverty.

పెంచలేక బిడ్డను దూరం చేసుకున్న తల్లి

Posted: 03/14/2015 02:02 PM IST
Mother gave her child to icds for her povertry

నవ మసాలు మోసి, ప్రాణం పోయే పురిటి నొప్పులను ప్రేమగా భరిస్తుంది తల్లి. తాను తల్లి అయినప్పుడే ఆడజన్మకు సార్థకం అయినట్లుగా భావిస్తుంది. తల్లిప్రేమను ఎందరో కవులు, రచయితలు ఎన్నో రకాలుగా గొప్పగ వర్ణించారు. అంత గొప్ప తల్లిప్రేమ, పేదరికం ముందు ఓడిపోయింది. పేగు తెంచుకు పుట్టిన బిడ్డను పెంచడం భారంగా భావించి తల్లిదండ్రులు స్వచ్ఛందగా శిశువిహార్‌కు అప్పగించిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండల పరిధి హాజీపూర్ తండాకు చెందిన ముడావత్ ఖల్లీ, కృష్ణ దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలున్నారు. మూడు రోజుల క్రితం వారికి మళ్లీ ఆడపిల్ల పుట్టింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో వారు ఆ పుట్టిన శిశువును  శిశువిహార్‌కు అప్పగించాలని నిర్ణయించారు. వారు మహబూబ్ నగర్ లోని శిశు విహార్ కు నవజాత శిశువును తరలించారు. కాగా అప్పటికే అక్కడ పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ శిశువును హైదరాబాద్ లోని శిశు విహార్ కు తరలించినట్లు మహబూబ్ నగర్ ఐసీడీఎస్ సీడీపీఓ గౌతమి తెలిపింది. తమ పోషణే భారంగా ఉందని కన్న బిడ్డను కూడా ఆ తల్లి వదులుకుంది.  పేదరికం ముందు అమ్మ ప్రేమ ఓడిపోయింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mother  poverty  girl child  mahabubnagar  icds  

Other Articles