India concerned over nasheed jail term in maldives

india, maldives, naseed, Mohamed Nasheed, jail, police

India voiced “deep concern” over the developments in the Maldives, a day after former president Mohamed Nasheed was sentenced to 13-year imprisonment by a criminal court of that country under anti-terror laws.

మాల్దీవుల మాజీ దేశాధ్యక్షుడికి 13 ఏళ్ల జైలు శిక్ష

Posted: 03/14/2015 11:50 AM IST
India concerned over nasheed jail term in maldives

మాల్దీవుల మాజీ దేశాధ్యక్షుడు  మహ్మద్ నషీద్ కు 13 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2012లో ఓ జడ్జిని కిడ్నాప్ చేసిన ఘటనలో, 1990 తీవ్రవాద వ్యతిరేక చట్టం కింద ఆయనపై పలు ఆరోపణలున్నాయి. అయితే మాల్దీవుల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన మొదటి అధ్యక్షుడు మహ్మద్ నషీదే కావడం విశేషం. కానీ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కోర్టుకు హాజరుకానున్న నషీద్ ను పోలీసులు దురుసుగా వ్యవహరించి, కోర్టుకు తరలించడం గతంలో సంచలనం రేపింది. అయితే ఆ ఘటనపై భారత్ విచారం వ్యక్తం చేసింది. మాజీ అధ్యక్షుడికి ఇలాంటి పరిస్థితి రావడంపై సానుభూతిని ప్రకటించింది.

కోర్టులో నషీద్ పై ఆరోపణల్లో నిజం తేలడంతో అతనికి 13 సంవత్సరాల జైలు శిక్ష ను ఖరారు చేసింది. అయితే భారత్ , మాల్దీవుల మధ్య కీలక సంబందాలు ఉన్న నేపథ్యంలో భారత్ మరోసారి నషీద్ విషయంలో స్పందించింది. మాల్దీవుల్లో ప్రస్తుతం తలెత్తిన పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నామని భారత్ ఓ ప్రకటన చేసింది. అక్కడి పరిస్థితిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ సమీక్షిస్తోందని తెలిపింది. కాగా మాల్దీవుల అభివృద్దికి భారత్ కట్టుబడి ఉన్నట్లు మరో సారి వెల్లడించింది. అయితే నషీద్ అభిమానులు మాత్రం కావాలనే తప్పుడు ఆరోపణలు మోపి, తమ నాయకుడిని జైలు పాలుచేశారంటూ అక్కడక్కడ నిరసన తెలుపుతున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  maldives  naseed  Mohamed Nasheed  jail  police  

Other Articles