Kalyanram in trouble for using 3 lions emblem

kalyan ram news, kalyan ram latest news, kalyan ram petition, kalyan ram patas movie, patas movie controversy, patas movie petition, kalyan ram controversies, ntr art banners, kalyan ram arrest news, kalyan ram case news, kalyan ram case, kalyan ram patas movie news, patas movie collections, patas movie police mark, patas movie problems

A case has been filed against Telugu actor Nandamuri Kalyan Ram at the Banjara Hills police station for misusing the sacred Three Lions Emblem in a wrong way in the title logo of his recent flick 'Patas.

దొంగలు పడిన ఆరు నెలలకు.. కళ్యాణ్ రామ్ పై కేసు

Posted: 03/13/2015 10:10 PM IST
Kalyanram in trouble for using 3 lions emblem

దొంగలు పడిన ఆరు నెలలకు.. అన్న చందంగా సినిమా విడుదలై సుమారు నెలన్నర కావస్తున్న తరుణంలో నటుడు నందమూరి కళ్యాన్ రామ్ పై కేసు నమోదు చేయాలని ఓ న్యాయవాది పోలీసులకు పిర్యాదు చేశాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించి, హీరోగా నటించిన పటాస్ సినిమా టైటిల్‌లో జాతీయ చిహ్నాన్ని అవమానపరిచేలా చిహ్నం ఏర్పాటు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన న్యాయ విద్యార్థి వై.శ్రీధర్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. పటాస్ టైటిల్‌లో టా అక్షరంపై అశోకచక్రం ఏర్పాటు చేశారని, ఇది చట్టవిరుద్ధమని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇదే అక్షరంపై అశోక చక్రం ముద్రించారని పేర్కొన్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని సాగర్ సొసైటీలో ఉన్న ఎన్టీఆర్ ఆర్ట్స్ సినిమా కార్యాలయంపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సినిమా విడుదలకు ముందే నందమూరి కల్యాణ్‌రామ్‌కు లీగల్ నోటీసు పంపించినా ఆయన స్పందించలేదని అందులో వివరించారు. కాగా ఈ ఫిర్యాదుపై నిపుణుల సలహా మేరకు కేసు నమోదు చేయనున్నట్లు బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ మురళీ కృష్ణ తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kalyan ram  patas movie controversy  kalyan ram police case  

Other Articles