Karnataka teacher stands ideal by donating organs

karnataka teacher stands ideal by donating organs, karnataka teacher gives life to five, karnataka teacher donates organs, karnataka teacher donates eyes, karnataka teacher donates kidneys, karnataka teacher donates heart, karnataka teacher brain hemorrhage

karnataka teacher stands ideal by donating her eyes, kidneys, and other body organs as her brain dead

అవయవదానంతో 5గురికి జీవితాన్నిచ్చిన ఉపాధ్యాయురాలు

Posted: 03/12/2015 08:59 PM IST
Karnataka teacher stands ideal by donating organs

మృత్యువుతో పోరాడుతున్న ఓ ఉపాధ్యయురాలు ఐదుగురి జీవితాల్లో కోత్త వెలుగులు నింపి తాను తనువు చాలించారు. అవయవ దానంతో ఐదుగురికి జీవితాన్నిచ్చి తాను అనంత వాయువులతో కలసిపోయారు. వివరాల్లోకి వెళ్తే..  రాష్ట్ర సరిహద్దులో కర్ణాటక శివారు ప్రాంతంలోని బంగారుపేట తాలుకా కుప్పస్వామి లేఔట్ లో తన భర్త సోమశేఖర్, పిల్లలతో కలసి నివాసం వుంటున్న శోభా.. స్థానికంగా గల కుందుహళ్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు విధులు నిర్వహిస్తున్నారు.

నెల క్రితం నుండి శోభా తీవ్రమైన తలనోప్పితో బాధపడుతున్న శోభా..  స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా.. నోప్పి మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో తలతిరిగి కింద పడి అపస్మారక స్థితిలోకి జారుకున్న శోభాను కుటుంబసభ్యులు.. ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించినా.. వారికి శోభను ఎలా సృహలోకి తీసుకురావాలన్న విషయమై ఎంతకీ అంతుచిక్కక పోవడంతో.. వారు బెంగుళూరులోని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో బెంగళూరులోని బీజీఎస్ గ్లోబల్ ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స చేయించగా.. అక్కడి వైద్యులు శోభ మెదడులో రక్తం గూడు కట్టిందని ఆమె బ్రతికే అవకాశాలు లేవని చెప్పారు.. ఇదే విషయాన్ని బాధితురాలి భర్త సోమశేఖర్ కు చెప్పారు.

దీంతో తన భార్యను బతికించుకోలేక పోయిన బాధ తనలో వున్నా.. పలువురి జీవితాల్లో తన భార్య కొత్త వెలుగులు నింపుతుందని గ్రహించిన సోమశేఖర్ తన భార్య అవయవాలు దానం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. అమె గుండె, రెండు కిడ్నీలు, రెండు కళ్లు, కాలేయం, ఊపిరితిత్తులు దానం చేశారు. బీజీఎస్ ఆసుపత్రిలో ఒక కిడ్నీ, ఇంకోక కిడ్ని సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో ఇద్దరు రోగులకు శాస్త్ర చికిత్స చేసి అమర్చారు. లివర్ ను బీజీఎస్ ఆసుపత్రిలో, గుండెను నారాయణ హృదయాలయలో, రెండు కళ్లను నారాయణ నేత్రాలయాలో బాధితులకు అమర్చారు. ఐదు శాస్త్ర చికిత్సలు సక్సస్ అయ్యాయి. తన భార్య మరణించలేదని, ఐదుగురి జీవితాల్లోనూ ఇంకా బతికే వుందని సోమశేఖర్ అవేదనతో అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karnataka teacher  donates organs  brain hemorrhage  

Other Articles