Aimim chief asaduddin owaisi refused entry in uttar pradesh again

Asaduddin Owaisi refused entry in Uttar Pradesh again, All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) chief Asaduddin Owaisi, AIMIM chief Asaduddin Owaisi, Owaisi refused entry in Uttar Pradesh again, Asaduddin Owaisi refused permission to hold a rally in Allahabad on March 15.

All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) chief Asaduddin Owaisi has again been refused permission to hold a rally in Allahabad on March 15.

అసుదుద్దీన్ మరో మారు చుక్కెదురు.. యూపీకి రావద్దని అదేశాలు..

Posted: 03/12/2015 01:36 PM IST
Aimim chief asaduddin owaisi refused entry in uttar pradesh again

అఖిల భారత మజ్లిస్ ఈ ఇతిహాదుల్ ముస్లీమీన్ ( మజ్లిస్ పార్టీ ) అధినేత అసుదుద్దీన్ ఓవైసీకి మరోమారు చుక్కెదురైంది. ఆయన దేశంలోని పలు రాష్ట్రాలలో తలపెట్టిన ర్యాలీలకు ఆయా ప్రభుత్వాల నుంచి అనుమతి లభించని విషయం తెలిసిందే. ఇప్పుడు అదే క్రమంలో మరోమారు ఆయనకు భంగపాటు తప్పలేదు. అసలే మతత్తత్వ చాంధసవాదంలో పలు ఘటనలు చోటుచేసుకున్న ఉత్తర్ ప్రదేశ్ లో ఆయన నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి అక్కడి పోలీసులు అనుమతిని నిరాకరించారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ లో తన పార్టీ తరపున ర్యాలీ, సభలు నిర్వహిస్తానని అందుకు అనుమతి ఇవ్వాలని అసుదుద్దీన్ ఓవైసీ పెట్టుకున్న ధరఖాస్తును పోలీసులు నిరాకరించారు. గతంలో ఉత్తర్ ప్రదేశ్ లోని అజాంఘర్, మీరట్ లలో ర్యాలీలను నిర్వహించ తలపెట్టిన సందర్భంలో కూడా పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఈ పరిణామాలపై అక్కడి ఎంఐఎం కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టును ఆశ్రయిస్తామని కూడా హెచ్చరించారు. దీనిపై స్పందించిన ఉత్తర్ ప్రదేశ్ మజ్లీస్ నేత షౌఖత్ అలి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సమాజ్ వాది ప్రభుత్వం.. కావాలని తమను అడ్డుకుంటోందన్నారు. ఎంఐఎం పార్టీ రాజ్యాంగ బద్దంగా నిర్వహించుకునే సభలను, ర్యాలీలను అడ్డుకోవడం సముచితం కాదని అన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asaduddin Owaisi  AIMIM  Uttar Pradesh  

Other Articles