Unemployed scholarships only to telangana localites

unemployed scholarships only to telangana localites, telangana localites statistics, government jobs, non locals in contract jobs, power supply, power crisis, No to AP power, Telangana government, KCR, new secratariat,

unemployed scholarships only to telangana localites after statistics

లెక్క తేలాకే.. ఉపకార వేతనాలు.. ఏపీ విద్యుత్ వద్దు..

Posted: 03/10/2015 08:39 PM IST
Unemployed scholarships only to telangana localites

నిరుద్యోగులకు ఉపకార వేతనాలు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న గణంకాల లెక్క తేలాల్సిందేనన్నారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. స్థానికులు, స్థానికేతరుల లెక్క తేలాలని, స్థానికేతరులకు ఇప్పుడు ఉపకారవేతనం ఇస్తే, వారు ఉద్యోగాల్లోనూ పోటీపడతారన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ 371డి ప్రకారం స్థానికులను గుర్తిస్తారన్నారు. తెలంగాణ యువతను దృష్టిలో పెట్టుకుని ఉపకారవేతనాలు ఇస్తామన్నారు. ఒప్పంద ఉద్యోగుల్లో స్థానికులు కానివారు చాలామంది ఉన్నారన్నారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ తప్పకుండా చేస్తామన్నారు. ఉద్యోగాల విషయంలో యువత ఆందోళన చెందవద్దని, రాబోయే రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు రాబోతున్నాయని కేసీఆర్ తెలిపారు.

తెలంగాణ కష్టాల్లో ఉన్నా కక్ష గట్టి ఏపీ విద్యుత్ ఇవ్వలేదని, ఇప్పుడు ఇస్తామన్నా తాము తీసుకోబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శాసనసభలో మాట్లాడుతూ ఆయన కేంద్రం చెప్పినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖాతరు చేయలేదన్నారు. రాష్ట్ర రైతాంగం కష్టాలు పడకూడదని రూ. 1500 కోట్లతో విద్యుత్ కొని రైతులకు ఇచ్చి పంటలు కాపాడుకున్నామన్నారు. ప్రస్తుత సీజన్‌లో ఎకరం పంటకూడా ఎండనివ్వకుండా చూస్తామన్నారు. వచ్చే మార్చి తర్వాత రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని కేసీఆర్ పేర్కొన్నారు.

నూటికి నూరు శాతం కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్త సచివాలయాన్ని నిర్మించి తీరుతామన్నారు.  సచివాలయానికి వాస్తు బాగోలేదంటే నానాయాగి చేశారన్నారు. హెచ్ వో డీలన్నీ ఒకే చోట ఉంటే తప్పేంటని కేసీఆర్ ప్రశ్నించారు. ఏపీ సీఎం, మంత్రులను గౌరవించాలని అధికారులకు చెప్పినట్లు కేసీఆర్ తెలిపారు. ఏపీ ఉద్యోగులు మరో కొన్నాళ్ల పాటు హైదరాబాద్ లో అభ్యంతర లేదని కేసీఆర్ తెలిపారు.  ఏపీ నుంచి జీతాలు తీసుకుని తమకు ట్యాక్స్ కడితే మంచిదన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana assembly sessions  cm kcr  richest state  

Other Articles