Mufti government clears release of 15 pak militants amid rajnath comments of no compromise on security

Mufti government clears release of 15 Pak militants, Rajnath comments of no Compromise on Security, Being in Power in JK not Priority, union home minister Rajnath singh, Jammu and Kashmir was under central rule, separatist Masarat Alam's release,

Mufti government clears release of 15 Pak militants amid Rajnath comments of no Compromise on Security,

మరో 15 మంది పాక్ ఉగ్రవాదుల విడుదలకు పచ్చజెండా

Posted: 03/10/2015 04:58 PM IST
Mufti government clears release of 15 pak militants amid rajnath comments of no compromise on security

భారతదేశంపై నరనరాన వ్యతిరేకతను నింపుకున్న వేర్పాటు వాది ముసరత్ ఆలం విడుదలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఇరుకున పెడుతుండగానే.. మరో వైపు మరో 15 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులను విడుదల చేయడానికి జమ్మూకాశ్మీర్ లోని ముఫ్తీ మహ్మమద్ సయ్యద్ ప్రభుత్వం పచ్చజెండాను ఊపింది. ఈ జాబితాలో పాకిస్థాన్ కు చెందిన వివిధ ఉగ్రవాద సంఘాలతో సంబంధమున్నవారిని విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసింది.

అక్రమంగా భారత్ లోకి చోరబడిన ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న భారత బలగాలు.. వారిని జమ్మూకాశ్మీర్ లోని వివిధ జైళ్లో బంధీలుగా పెట్టగా.. వారిని బంధవిముక్తుల్ని చేసేందుక జమ్మాకాశ్మీర్ ప్రభుత్వం సంకల్పించింది. కాగా ప్రభుత్వం విడుదల చేయదలచిన వారందరూ కూడా అక్రమంగా దేశంలోకి చోరబడిన వారేనని తెలుస్తుంది. వీరందరినీ వాఘ్హా సరిహద్దు ద్వారా పాకిస్థాన్ భద్రతా దళాలకు అప్పగించేందుకు కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం తేదీలను ఖరారు చేసే పనిలో వున్నట్లు సమాచారం.

అయితే విడుదల కాబోతున్న వారిలో రమారమి అందరి వద్ద అక్రమ అయుధాల కేసుతో పాటు జమ్మూ కాశ్మీర్ లోని భద్రతా దళాలు, ఫౌరులను హతమార్చిన కేసులో నిందితులని సమాచారం. పాకిస్థాన్ దౌత్యకార్యాలయం నుంచి అందిన 68 మంది జాబితాలో నుంచి 15 మందిని విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో శ్రీనగర్ సెంట్రల్ జైలు లో బందీలుగా వున్న లష్కరే తోయిబా, హిజ్ బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన అగ్రశేణి ఉగ్రవాదులు కూడా వున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mufti government  pak millitants  Rajnath singh  union home ministry  

Other Articles