Telangana tdp mlas arrested today at gunpark

ttdp, mlas, gunpark, section144, revanth reddy, yerrabelli

telangana tdp mlas arrested today at gunpark. ttdp leadres commence a rally at gunpark in hyderabad, police officials arrested ttdp leaders.

నిన్న సస్పెండయ్యారు.. ఈ రోజు అరెస్టయ్యారు

Posted: 03/10/2015 11:55 AM IST
Telangana tdp mlas arrested today at gunpark

తెలంగాణ అసెంబ్లీలో సస్పెండ్ కు గురైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద నిరసనకు దిగారు. ఆందోళన చేస్తున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున 144 సెక్షన్ కారణంగా అసెంబ్లీ పరిసరాల్లో ఎలాంటి ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు వారికి స్పష్టం చేశారు. అరెస్ట్ అయినవారిలో ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి, సండ్ర వీరయ్య, మాధవరం కృష్ణారావు, గోపీనాథ్, గాంధీమోహన్, రాజేందర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులను అరెస్ట చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.  టీడీపీ పట్ల టీఆర్ఎస్ సర్కార్ కక్ష సాధిస్తుందంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అంతకు ముందు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు నోటికి నల్ల రిబ్బర్లు కట్టుకుని నిరసన తెలిపారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చెయ్యడం పై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. తెరాస కావాలనే తెలుగుదేశం పార్టీ నాయకులను బడ్జెట్ సమావేశాల నుండి సాగనంపిందని కొందరు అనుకుంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీపై కావాలనే తెరాస కక్ష సాధింపులక దిగుతోందని టిడిపి ఆరోపిస్తోంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ttdp  mlas  gunpark  section144  revanth reddy  yerrabelli  

Other Articles