Central govt make 9 changes in land acquisition bill

nda, modi, landpooling, Land Acquisition Bill, parliament, farmers, shivasena, voting, rajyasabha

The NDA government has proposed substantial changes to the controversial Land Acquisition Bill to seek a wider support from an agitated opposition which has slammed the amendments to the 2013 Act, calling it "anti-farmer". The bill, which was debated in the Lok Sabha on Monday, will be taken up for voting on Tuesday.

తొమ్మిది మార్పులకు ప్రభుత్వం సిద్దం..

Posted: 03/10/2015 11:37 AM IST
Central govt make 9 changes in land acquisition bill

ఎన్డీయే ప్రభుత్వానికి దినదిన గండంగా మారిన భూసేకరణ చట్టంలో మార్పులకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రతిపక్షాల ప్రతిపాదనల్లో తొమ్మిదిని బిల్లులో మార్పులు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే భాజపాకు మద్దతుగా నిలవాల్సిన మిత్రపక్షాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. శివసేన, పిడిపి, తెలుగుదేశం లాంటి పార్టీల్లో చాలా పార్టీలు బిల్లులో మార్పులను కోరుతున్నాయి. శివసేన బాహాటంగానే మార్పు చెయ్యకపోతే బిల్లుకు మద్దతిచ్చేది లేదని తేల్చింది. అయితే పార్లమెంట్ సభల్లో రాజ్యసభలో మెజారిటీ లేని ప్రభుత్వం ఎలా గట్టెక్కుతుందా అన్నది ప్రశ్న, అయితే భూసేకరణ బిల్లును ఎట్టి పరిస్థితిలొనైనా చట్టంగా మార్చాలని ఎన్డీయే కంకణం కట్టుకుంది. అయితే ఉభయ సభలను సమావేశానానికి పిలిచి, అప్పుడు మెజారిటీ ద్వారా బిల్ ను పాస్ చెయ్యాలని ఎన్డీయే యోచిస్తోంది. కానీ మిత్రపక్షాలు భాజపాకు చెయ్యిస్తే మాత్రం అది కుదరదు.

ఓటింగ్ నేపథ్యంలో బిజెపి ఎంపీలు అందరూ పార్లమెంట్ కు హాజరు కావాలని బిజెపి విప్ జారీ చేసింది. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు కూడా ప్రతిపక్షాలను బెజ్జగించే పనిలో ఉన్నారు. అయితే వెంకయ్య మాటలకు ప్రతిపక్షాలు కరగడం లేదని సమాచారం. అయితే ఎన్డీయే ప్రభుత్వం చేసే అభివృద్ది పనులకు ప్రతిపక్షాలు అడ్డుతగలడం మంచిది కాదని వెంకయ్య విమర్శించారు. కాగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా భూసేకరణ బిల్లులో మార్పులకు సిద్దపడిన నేపథ్యంలో ఏం జరుగుతుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nda  modi  landpooling  Land Acquisition Bill  parliament  farmers  shivasena  voting  rajyasabha  

Other Articles