Prabha arun kumar murdered in sydney of australia

Prabha Arun Kumar, Australia, Sydney, investigation, sushmaswaraj, tweet,

Australia on Monday assured India that the fatal attack on Prabha Arun Kumar in a Sydney suburb is being probed by the police with utmost seriousness and that a special detective squad was formed to pursue the investigations.

సిడ్నీలో భారతీయురాలి హత్య

Posted: 03/09/2015 04:01 PM IST
Prabha arun kumar murdered in sydney of australia

ఆస్ట్రేలియాలో భారతీయ మహిళ ఐటీ ఉద్యోగి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఆఫీసు నుంచి ఇంటికి తిరిగివెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు పొడిచి చంపారు. ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో వెనకనుంచి ఓ వ్యక్తి వచ్చి కత్తితో పొడిచాడు. దాంతో తీవ్ర రక్తస్రావమై ఆమె మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈఘటన ఆమె నివాసానికి దగ్గరలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు బెంగళూరుకు చెందిన ప్రభాశెట్టిగా పోలీసులు గుర్తించారు. ఈమే సిడ్నీలో ఐటీ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మైండ్‌ ట్రీ అనే ఐటి సంస్థ ఉద్యోగి అయిన ఈమే ఆఫ్‌ సైట్ పనిపై మూడేళ్ల క్రితం సిడ్ని వెళ్లారు. వచ్చే ఏడాది ఇండియాకు తిరిగిరావాల్సి ఉంది. అంతలోనే ఈదారుణం చోటుచేసుకుంది.

బీఐ కంప్యూటర్స్ పూర్తి చేసిన ప్రభ అంతకుముందు రెండు ఐటి కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం మైండ్‌ ట్రీలో సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ గా పనిచేస్తున్నట్లు బంధువులు తెలిపారు. ప్రభాభర్త అరుణ్‌కుమార్ కూడా ఐటీ నిపుణుడే బెంగళూరులో 11 ఏళ్లుగా ఆయన ఒక సాఫ్ట్ వేర్ కంపెనీని నిర్వహిస్తున్నారు. ప్రభ, అరుణ్‌ దంపతులకు మేఘన అనే కుమార్తె ఉంది. అయితే ఆమె బెంగుళూరులోని తన భర్త అరుణ్‌తో ఫోన్‌లో మాట్లాడుకుంటూ వస్తుండగా దుండగుడు తనను వెంబడిస్తున్నాడని చెప్పిందని భర్త తెలిపారు. 'నన్ను వెళ్లనివ్వండి, కావాలంటే నా బ్యాగ్ తీసుకోండి, ఇంకా ఏమి కావాలన్నా ఇస్తాను' అని చెబుతుండగా ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్లు ఆయన చెప్పారు. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది.

sydney

భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రభాఅరుణ్ కుమార్ హత్య తనను తీవ్రంగా బాధించిందని సుష్మా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అయితే సిడ్నీకి చెందిన నిఘా వర్గాలు కూడా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు. హత్యకు కొద్దిసేపు ముందు దగ్గరలోని రైల్వే స్టేషన్ లో ప్రభా అరుణ్ కు సంబందించిన ఓ సిసిటివి వీడియోను అక్కడి పోలీసులు విడుదల చేశారు. అయితే ఆమె భర్త, తోటి ఉద్యోగుల నుండి వివరాలను తెలుసుకుంటున్నారు పోలీసులు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Prabha Arun Kumar  Australia  Sydney  investigation  sushmaswaraj  tweet  

Other Articles