Mamata banerjee met prime minister narendra modi

Prime Minister Narendra Modi, Mamata Banerjee, West Bengal,

Prime Minister Narendra Modi on Monday assured West Bengal Chief Minister and Trinamool Congress (TMC) supremo Mamata Banerjee that no stone will be left unturned for the development of the state.

పశ్చిమ బెంగాల్ పై మోదీ 'మమత'!

Posted: 03/09/2015 04:55 PM IST
Mamata banerjee met prime minister narendra modi

మమత బెనర్జీ, నరేంద్ర మోదీలకు మధ్య ఎన్నికల సమయంలో పెద్ద యుద్దమే జరిగింది. అయితే తరువాత ఎన్నికల్లో భాజపా భారీ మెజారిటీతొ గెలడం, తరువాత నరేంద్రమోదీ ప్రధానిగా కావడం టకటకా జరిగాయి. అయితే మమతా బెజర్జీ మొదటి సారి ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిశారు. అప్పుల్లో ఉన్న పశ్చిమబెంగాల్ ను గట్టెక్కిక్కించేందుకు ఆర్థిక సహాయం చేయాలని మమత ప్రధానమంత్రిని కోరినట్టు తెలుస్తోంది. దీనికి మోదీ నుండి మాత్రం సానుకూలంగా స్పందించారని సమాచారం.  అయితే బొగ్గు గనుల వేలంలో, క్లీన్ గంగ ప్రచారంలో రాష్ట్రానికి  ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

mdoitweet
 
రాష్ట్రంలో  భారీ అప్పుల్లో ఉన్న విషయాన్ని వాస్తవమేనని ప్రధాని అంగీకరించారని, ఈ విషయాన్ని తాను పరిశీలిస్తానని  మోదీ చెప్పినట్టు  సమావేశం తర్వాత మమత  వెల్లడించారు.ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పాటుచేసని నీతి ఆయోగ్ మొదటి సమావేశానికి కనీసం తన ప్రతినిధిని కూడా పంపని మమత బెనర్జీ తాజాగా ప్రధానమంత్రి ని కలవడం  ప్రాధాన్యతను సంతరించుకుంది.  అయితే ప్రధాని నరేంద్ర మోదీ తరఫున సానుకూల స్పందన వచ్చింది. పశ్చిమబెంగాల్ కు మరిన్ని నిధులను సమకూర్చుగలమని కేంద్రం తరఫున మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా పై పరిశీలించాలని కూడా మమత కోరినట్లు సమాచారం. 14 వ ఆర్థిక సంఘం ఇప్పటికే రాష్ట్రాలకు నిధుల విషయంలో ఎక్కువ ప్రాధాన్యత కల్పించామని, దాన్ని పశ్చిమ బెంగాల్ వినియోగించుకోవాలని మోదీ సూచించినట్లు తెలుస్తోంది.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prime Minister Narendra Modi  Mamata Banerjee  West Bengal  

Other Articles