Corporates ready to yadadri development

corporates ready to yadadri development, corporates ready to give huge donations, telangana temple city, donations for yadadri development, Yadadri, telangana temple city, KCR, corporates, land acqisition for yadadri, telangana cm KCR

corporates ready to give huge donations for yadadri development

ఏడుకొండలను తలపించేవిధంగా యాదాధ్రి.. కార్పోరేట్ల విరాళం

Posted: 03/08/2015 03:30 PM IST
Corporates ready to yadadri development

రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రవిత్ర ఫుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న ఏడుకోండల తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కొల్పయిన నేపథ్యంలో తెలంగాణ భక్తుల కోసం అందుకు ధీటుగా యాదగిరిగుట్టను అభివృద్దికి ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే వంద కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి.. టెంపుల్ సిటీగా మార్చతున్నారు. ఈ నేపథ్యంలో యాదగిరి గుట్ట అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయల మేర అవసరం అవుతున్న నేపథ్యంలో ఆయన బడా కార్పొరేట్ సంస్థల సహకారాన్ని తీసుకోనున్నారు.

రాష్ట్రంలోనే అత్యద్భుత ఆధ్మాత్మిక కేంద్రంగా, తెలంగాణ టెంపుల్ సిటీగా యాదాద్రిని తీర్చిదిద్దాలనుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సహకరించేందుకు టాటా, అంబానీలు సిద్ధమయ్యారు, శ్రీలక్ష్మీ నారసింహుడు కొలువైన పుణ్యక్షేత్రం సమగ్రాభివృద్ధిలో కార్పొరేట్ సంస్థలు కూడా పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్ల సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) కార్యక్రమం కింద యాదాద్రిపై సౌకర్యాల కల్పనకు దాదాపు రూ. 500 కోట్లు ఖర్చు చేసేందుకు రిలయన్స్, టాటా కంపెనీలు ముందుకొచ్చినట్లు సమాచారం.

గుట్ట అభివృద్ధికి భూ సేకరణ కూడా పూర్తయిన నేపథ్యంలో పనులు వేగంగా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. సీఎం ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం రెండు వేల ఎకరాల స్థల సేకరణ కూడా పూర్తయింది. అందులో వెయ్యి ఎకరాలకుపైగా భూమిని ఇప్పటికే గుట్ట డెవలప్‌మెంట్ అథారిటీకి అప్పగించారు. రాయగిరిలో దిల్ సంస్థకు ఇచ్చిన భూమితో పాటు పక్కనే మరో 300 ఎకరాలకుపైగా విలువైన ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. దీన్ని కూడా గుట్ట అథారిటీకి కేటాయించారని, ఇందుకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం సీసీఎల్‌ఏ వద్ద ఉందని అధికారులు చెబుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yadadri  telangana temple city  KCR  corporates  

Other Articles