Ashokagajapathiraju attacks on congress

ashokagajapathiraju, ap, specialstatus, congress

ashokagajapathiraju attacks on congress. he said that congress cms are not support to the special status to ap.

ప్రత్యేక హోదా కు కాంగ్రెస్సే అడ్డంకు..

Posted: 03/07/2015 07:46 PM IST
Ashokagajapathiraju attacks on congress

ఏపికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కాంగ్రెస్ కారణమంటూ కొత్త పల్లవి అందుకున్నారు తెలుగుదేశం నేతలు. భాజపా నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పని చేస్తున్న అశోక గజపతి రాజు, ఏపికి ప్రత్యేక హోదా దక్కకుండా కాంగ్రెస్ అడ్డు అంటూ కొత్త బాంబ్ పేల్చారు. అయినా అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ అయితే కాంగ్రెస్ పై ఆరోపణలు చెయ్యడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మోదీ క్యాబినెట్ లో మంత్రిగా ఉండి కూడా, అక్కడ ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోతున్నారని, ఆడలేక మద్దెలు బాగులేవన్న చందంగా అశొకగజపతిరాజు వ్యవహారం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా దక్కకపోవడానికి కారణం కాంగ్రెస్‌ పార్టీయేనని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు వెల్లడించారు. విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదాను కాంగ్రెస్ కల్పించలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక హోదా కల్పిద్దామనుకున్నా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. 14 వ ఆర్థిక సంఘం కూడా ప్రత్యేకు హోదా కుదరదని తేల్చి చెప్పిందన్నారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు మేలు చేకూరేలా విభజన చట్టాన్ని రూపొందించిందని ఆరోపించారు. విభజన బిల్లులో విశాఖ రైల్వే జోన్, పరిశ్రమలకు ప్రోత్సాహకాల విషయం ప్రస్తావించకపోవడంతో ప్రస్తుతం కేంద్రం నుంచి సహాయం అందడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ashokagajapathiraju  ap  specialstatus  congress  

Other Articles