Saina nehwal reach all england final

Saina Nehwal, All England final,Sun Yu

Indian ace Saina Nehwal sailed into the All England Championships final after beating her Chinese opponent Sun Yu on Saturday. The third seeded Indian prevailed 21-13, 21-13 in a 5--minute contest.

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో సైనా.. మొదటి భారతీయురాలిగా రికార్డు

Posted: 03/07/2015 07:37 PM IST
Saina nehwal reach all england final

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో సైనా ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా హైదరాబాదీ చరిత్ర సృష్టించింది.  మహిళల సింగిల్స్ సెమీస్లో సైనా 21-13, 21-13 స్కోరుతో చైనా షట్లర్ సన్ యూపై అలవోక విజయం సాధించింది. సైనా వరుస గేమ్ల్లో మ్యాచ్ను స్వంతం చేసుకుంది.  క్వార్టర్ ఫైనల్స్ లో యియాన్ వాంగ్ ను 21-19, 21-6 తేడాతో ఓడించింది.ఐదు లక్షల డాలర్లు ప్రైజ్ మీన ఉన్నఈ టోర్నీలో ప్రవేశించి సైనా నెహ్వాల్ భారత క్రీడా ప్రపంచం కీర్త ప్రతిష్టలను పెంచారు.

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ ను గతంలో పుల్లెల గోపీచంద్ సాధించారు. ఇప్పుడు తాజాగా పుల్లెల గోపీచంద్ శిష్యురాలు సైనా నెహ్వాల్  ఫైనల్లో గెలిచి, రికార్డులకెక్కారు. మొత్తానికి ఇలా భారతీయ క్రీడా ప్రపంచానికి మరో కీర్తి కిరీటాన్ని సాధించింది సైనా నెహ్వాల్.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saina Nehwal  All England final  Sun Yu  

Other Articles