Two countrys on indian fisherman

fisherman, pakistan, srilanka, waters, boarders, attacks

srilanka and pakistan attacks on indian fisherman. the srilankan prime minister warned indian fisherman, the country has the rules to shoot.

భారత జాలర్లపై పాక్, శ్రీలంకల దాడులు

Posted: 03/07/2015 03:18 PM IST
Two countrys on indian fisherman

శ్రీలంక సముద్ర జలాల్లోకి భారత జాలరులు ప్రవేశిస్తే వారిని కాల్చేందుకు చట్టాలున్నాయని ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే హెచ్చరించారు. మరో పక్క పాకిస్థాన్ 48 మంది జాలర్లను అరెస్టు చేసింది. జీవనోపాధి కోసం చేపలు పట్టుకునే జాలర్లపై రెండు దేశాలు ఇలా కఠినంగా వ్యవహరించడం సర్వత్రా చర్చకు దారితీసింది. కాగా వచ్చే వారంలో శ్రీలంక పర్యటనకు మోదీ వెళ్లనున్న సమయంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం అంతర్జాతీయ మీడియాలోనూ వార్తలకెక్కింది. భారత జాలర్లపై ఇలాంటి వైఖరిని ప్రదర్శిస్తున్న పొరుగు దేశాలతో కేంద్ర చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని విశ్లేషకులు కోరుతున్నారు.

అయితే శ్రీలంక ప్రభుత్వం వాదన మరోలా ఉంది. ఎల్టీటీఈ వర్గాలకు భారత్ నుండి సముద్ర మార్గాల ద్వారా ఆయుధాలు చేరుతున్నయని భావిస్తోంది. అందుకే భారత జాలర్లు తమ సముద్ర జలల్లోకి ప్రవేశిస్తే, వారిని అదుపులోకి తీసుకుంటున్నాయి. మరో పక్క పాకిస్థాన్ తన జలాల్లోకి వచ్చే భారత జాలర్లను అరెస్టు చేసి జైలులో పెడుతున్నాయి. కాగా జైలు శిక్ష పూర్తైన తర్వాత కూడా వారిని విడిచిపెట్టడం లేదు. దాంతో కుటుంబ సభ్యులకు దూరమైన ఎంతో మంది జాలర్లు ఆవేదన చెందుతున్నారు. భారత ప్రభుత్వం శాంతి చర్చల ద్వారా రెండు దేశాల్లో బంధీలుగా ఉన్న జాలర్లను విడిపించాల్సిన అవసరం ఉంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fisherman  pakistan  srilanka  waters  boarders  attacks  

Other Articles