Contraversy going on for nirbhaya documentary

nirbhaya, daughterof india, bbc, documentary, mukesh, editors gild, bar council, delhi gangrape

The Bar Council of India has issued notices to two defence lawyers for their remarks in a documentary "India's Daughter" - depicting the brutal gang-rape and murder of a paramedic student in Delhi in 2012 - that have sparked massive outrage and condemnation.

ఆ డాక్యుమెంటరీపై సాగుతున్న వివాదాలు

Posted: 03/07/2015 01:50 PM IST
Contraversy going on for nirbhaya documentary

నిర్భయ కేసు నేపథ్యంలో వచ్చిన ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీలో మహిళలనుద్దేశించి అభ్యంతర వ్యాఖ్యలు చేసిన డిఫెన్స్ లాయర్లకు  బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నోటీసులు జారీ చేసింది.  వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన  ఇద్దరు న్యాయవాదులకు షోకాజ్ నోటీసులిచ్చామని  బీసీఐ ఛైర్మన్  మనన్ కుమార్ మిశ్రా వెల్లడించారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో దోషుల తరపున వకాల్తా పుచ్చుకున్న ఎంఎల్, శర్మ, ఎపి సింగ్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మహిళలు జంతువులతో పోలుస్తూ  చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని  రేపాయి.  దీనిపై  మహిళా సంఘాలు,  న్యాయనిపుణులు, సామాజిక కార్యకర్తలు  సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు.

మరో పక్క నిర్భయ డాక్యుమెంటరీపై బ్యాన్ ను ఎత్తివెయ్యాలని ఎడిటర్స్ గిల్డ్ కొరింది. ప్రభుత్వం కావాలని ఈ డాక్యుమెంటరీని అడ్డుకోవడం పై మండిపడింది. డాటర్ ఆఫ్ ఇండియా పేరుతో తీసిన డాక్యుమెంటరీలో నిర్భయ తల్లిదండ్రులు చూసిన దైర్యం, వారికి దేశం మొత్తం బాసటగా నిలిచిన తీరును చాలా బాగా చూపించారని తెలిపింది. గ్యాంగ్ రేప్ చేసిన వ్యక్తి చెబుతున్న మాటలను బట్టి, అతని ఆలోచనల స్థాయి అర్థమవుతోందని వెల్లడించారు. కొందరు ప్రముఖులు కూడా నిర్భయ ఘటనపై ఎలా స్పందించారో ఆ డాక్యుమెంటరీలో ఎంతో స్పష్టంగా ఉందని ఎడిటర్స్ గిల్డ్ వివరించింది. అయితే ప్రభుత్వం ఆ డాక్యుమెంటరీపై ఉన్న బ్యాన్ ను వెంటనే ఎత్తివెయ్యాలని, దేశంలో ఆ డాక్యుమెంటరీని ప్రసారం చెయ్యాలని కోరింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nirbhaya  daughterof india  bbc  documentary  mukesh  editors gild  bar council  delhi gangrape  

Other Articles