Cm k chandrasekhar rao s minister member of opposition

Telugu states Assembly budget sessions begins today, Telugu states Assembly budget sessions from today, Telangana Assembly budget sessions begins today, KCR minister member of Opposition!, Telangana Commercial taxes minister Talasani Srinivas Yadav, Talasani Srinivas Yadav, legislative member of assembly from TDP, TDP legislator talasani srinivas yadav, Telugu desam party, TDP, YSRCP, TRS, Congress party, BJP, CPI,

Commercial taxes minister Talasani Srinivas Yadav, being a minister in the K. Chandrasekhar Rao’s Cabinet, will attend the Assembly Session from Saturday from the Treasury benches while continuing as a Telugu Desam Legislator as per the records.

తొలిసారి తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష మంత్రి..

Posted: 03/07/2015 09:10 AM IST
Cm k chandrasekhar rao s minister member of opposition

తొలిసారి తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష మంత్రి.. శీర్షిక చూసి కంగారు పడుతున్నారా..? కానీ ఇది నిజం. మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ప్రతిపక్షానికి చెందిన వ్యక్తి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు క్యాబినెట్ లో. ప్రతిపక్షంలో వున్నవారు ఎమ్మెల్యేలు అవుతారు.. లేదా పార్టీ ప్రతిపాధిస్తే పార్టీ శాసనసభ పక్ష నేత అవుతారు కానీ మంత్రి ఎలా అవుతారు..? ఇదేం విచిత్రం అనుకుంటున్నారా..?

అవును వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ఘనత సాధించారు. అదెలా అంటే.. ఆయన తన ఎమ్మెల్యే సహా టీడీపీ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. ఆ వెనువెంటనే ఆయనను తమ మంత్రి మండలిలో స్థానం కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కాగా, ఆయన తన శాసనసభ్యత్వానికి చేసిన రాజీనామాను ఇప్పటికీ అసెంబ్లీ స్పీకర్ అమోదించలేదు. దీంతో అసెంబ్లీ రికార్డుల ప్రకారం ఆయన సనత్ నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ తరపున గెలిచిన శాసనసభ్యుడిగా వున్నారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన పలువురు శాసనసభ్యులలో తలసాని ఒకరు కాగా, ఆయన ఒక్కరు మాత్రమే తన శాసనసభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఇదిలావుండగా గతంలో అనేక మంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడినా.. ఎవర్వూ ప్రతిపక్ష సభ్యుల కోటాలో మంత్రి పదవులలో కోనసాగిన వారిలో లేరు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assembly budget sessions  Telangana  Talasani Srinivas Yadav  

Other Articles