Telanagana it minister ktr fire on chandrababu

ktr, kalvakuntlatarakaramarao, chandrababunaidu, telanagana, water, electricity, irrigation

telanagana it minister ktr fire on chandrababu: telanagana information and technolory, panchayathraj minister ktr fire on tdp president chandrababu naidu. he said that babu tried to stop the electricity, water to telanagana.

అతని కడుపులో కత్తులు.. పెదవులపై నవ్వులు

Posted: 03/05/2015 10:52 AM IST
Telanagana it minister ktr fire on chandrababu

ఏపీ సీఎం చంద్రబాబునాయుడి కడుపులో కత్తులుంటాయని, ఆయనది పెదవితో నవ్వుతూ నొసటితో వెక్కిరించే తత్వమని కెటిఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లాకు వచ్చిన చంద్రబాబు తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామని చిలుకపలుకులు మాట్లాడుతున్నాడని విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన 54శాతం వాటా విద్యుత్‌ను గల్లాపట్టి తెచ్చుకునే సత్తా తమ ప్రజలకుందన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మనకు రావాల్సిన వాటాను ఇవ్వకుండా వందశాతం ఆంధ్రాకే ఇవ్వాలంటూ హిందుజా సంస్థను చంద్రబాబునాయుడు బెదిరిస్తున్నాడు. హుద్‌హుద్ తుఫాన్‌లో ఘోరంగా నష్టపోయిన ఆంధ్ర ప్రాంతాన్ని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం 20కోట్ల విలువగల విద్యుత్ సామగ్రిని ఉచితంగా పంపించి ఆదుకుందని అన్నారు. అయినా ఆంధ్రావారికి కనికరంలేదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

 తెలంగాణ రైతులు పంటలు ఎండిపోతున్నాయని ఏడ్చినా నీళ్లు ఇవ్వకుండా అడ్డుకోవడమే అందుకు ఉదాహరణ అని కెటిఆర్ పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఇరు ప్రాంతాల పోలీసులు తన్నుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి పోలీసులను వెనక్కి రప్పించారని తెలిపారు. తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబు మోచేతి నీళ్లు తాగాలనుకోవడం కన్నా దరిద్రం ఇంకొకటి ఉండదని వ్యాఖ్యానించారు.  టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలంగాణతల్లి పాలు తాగినోళ్లయితే పునర్నిర్మాణంలో కలిసి రావాలని కేటీఆర్ హితవు పలికారు. ఇంకా ఆంధ్రావారికి వంతపాడితే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ktr  kalvakuntlatarakaramarao  chandrababunaidu  telanagana  water  electricity  irrigation  

Other Articles