Political parties fund collection

political party, fund,loksabha, elections, election commission, bjp, congress,samajvadiparty

The total funds collected by national parties during Lok Sabha polls has grown nearly five times in the last 10 years, with the Bharatiya Janata Party (BJP) and Congress topping the charts in terms of capital mop-up

డబ్బు రాజకీయాలు.. పార్టీలకు పది రెట్లు పెరిగిన నిధులు

Posted: 03/03/2015 09:14 AM IST
Political parties fund collection

రాజకీయాలు బాగా కాస్లీ అయిపోయాయి..అని ఓ సినిమాలో తనికెళ్ల భరణి మాటలు అక్షరాల వాస్తవం. ఎందుకంటే రాజకీయాలు చెయ్యాలంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండాల్సిందే. అయితే దేశంలో వందల సంఖ్యలో ఉన్న పార్టీలు, వేల సంఖ్యలో ఉన్న రాజకీయ నేతలు ఇలా ఇంత పెద్ద వ్యవస్థ ను నడిపించే ప్రధాన ఇంధనం డబ్బే. దేశంలోని జాతీయ పార్టీలు గత పదేళ్లలో సేకరించిన విరాళాలు దాదాపు ఐదు రెట్లు పెరిగాయి. ఎన్నికల ఖర్చులూ సుమారు నాలుగు రెట్లు పెరిగాయి. ఎన్నికల ప్రకటన, ముగింపునకు మధ్య 75 రోజుల్లో సేకరించిన విరాళాలు, ఖర్చు చేసిన మొత్తాల్లోతొలిస్థానంలో బీజేపీ,తరువాతి స్థానంలో కాంగ్రెస్‌లు నిలిచాయి. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థల అధ్యయనంలోవెలుగు చూసిన తాజా వివరాల ప్రకారం దేశంలో పార్టీలకు చేరుతున్న నిధులు అంతకంతకు పెరుగుతున్నాయి.  ఎన్నికల ఖర్చులపై జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎంలు ఎన్నికల సంఘానికి అందించిన వివరాల ఆధారంగా ఈ సంస్థలు ఓ నివేదిక రూపొందించాయి.

గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో ఆరు జాతీయపార్టీలు రూ. 2,237 కోట్లు సేకరించాయి. ఇందులో 54 శాతం అంటే 1,205 కోట్లు చెక్కుల రూపంలో, 45 శాతం అంటే 1,007 కోట్లు నగదుగా వచ్చాయి. బీజేపీ రూ.1,171.38 కోట్లతో తొలిస్థానంలో, రూ. 778.49 కోట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచాయి. తర్వాతి స్థానంలో 90.95 కోట్లతో ఎన్సీపీ, సీపీఎం 66.27 కోట్లు, సీపీఐ 19.74 కోట్లు సేకరించాయి. మూడు ఎన్నికల్లో ఈ పార్టీల్నీ కలిపి 2,454 కోట్లు ఖర్చు పెట్టాయి. ఇది వాటికి అందిన మొత్తం కంటే ఎక్కువ. బీజేపీ 1,263.94 కోట్లు, కాంగ్రెస్ 1,015.86 కోట్లు ఖర్చు చేశాయి. ఇలా సేకరించిన వాటిలో  50.58 శాతం ప్రచారానికి, 19.68 శాతం ప్రయాణ ఖర్చులకు, 15.43 శాతం అభ్యర్థుల కోసం వెచ్చించాయి. బీజేపీ గత ఎన్నికల్లో అత్యధికంగా 342 కోట్లను మీడియాలో ప్రకటనల కోసం ఖర్చు చేసింది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఆరు పార్టీలకు కలిపి 223.8 కోట్ల నిధులు రాగా, 2014లో ఈ మొత్తం 1,158.59 కోట్లకు పెరిగింది. మరి ఇంత చదివిన తర్వాతైనా రాజకీయాలు బాగా కాస్టీ అయ్యాయని ఒప్పుకోరా..తప్పదు ఒప్పుకొని తీరాల్సిందే.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : political party  fund  loksabha  elections  election commission  bjp  congress  samajvadiparty  

Other Articles