Modi tweet on budget

modi appriciate finance minister for excellent budget. in twitter modi tweet that financial minister bringing excellent budget. the new budget has clear vision.

modi tweet on budget

బడ్జెట్ పై ప్రశంసలు కురిపించిన మోదీ

Posted: 02/28/2015 01:42 PM IST
Modi tweet on budget

బడ్జెట్ పై మోదీ ప్రశంసలు కురిపించారు. అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ క్లీయర్ విజన్ కలిగి ఉందని ట్వీట్ చేశారు. ఓ వైపు అరుణ్ జైట్లీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తుంటే, మరో పక్క మోదీ ట్విట్టర్ లో ట్వీట్ ల మోత మోగించారు. మధ్య తరగతి, పేద, యువతకు పెద్ద పీట వేస్తున్న బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నందుకు అరుణ్ జైట్లీ గారిని అభినందించాల్సిందేనన్నారు. కొత్త ఆవిష్కరణకు, కొత్త ఆలోచనలకు భారత్ ప్రాధాన్యత ఇస్తోందని, భారత్ వెలిగిపోవడానికి ఎంతో కృషి చేస్తున్నమని తెలిపారు. సురక్షా భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, జీవన్ జ్యోతి భీమా యోజన, విద్యాలక్ష్మి కార్యక్రమ్ లాంటివి జన్ ధన్ నుండి జన్ కళ్యాణ్ దిశగా అడుగులు వేస్తోందని అన్నారు.

modi-tweet-on-budget

బ్లాక్ మనీని రప్పించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామని అందులో భాగంగా బడ్జెట్ లో కొత్త చట్టాన్ని ప్రతిపాదించామని అన్నారు.  దేశంలోని ఈశాన్య, మరి కొన్ని రాష్ట్రాలకు కూడా సమ ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. 2022 నాటికి అందరికి ఇళ్లు, ఉద్యోగాలు, విద్య, విద్యుత్, ఆరోగ్యం అందిస్తామని ఆ దిశగా బడ్జెట్ ఉందని అన్నారు. బడ్జెట్ ప్రోగ్రెసివ్, పాజిటివ్, ప్రాక్టికల్ గా ఉందని ట్వీట్ చేశారు.  పనిలో పనిగా ప్రధాని మోదీ భారత శాస్ర్తవేత్తల గొప్పదనాన్ని కీర్తించారు. దేశ అభివృద్దిలో శాస్ర్తవేత్తల పాత్ర ఎంతో కీలకమని, ప్రస్తుతం మనం మెరుగైన పరిస్థితుల్లో ఉన్నామంటే దానికి శాస్ర్తవేత్తల కృషి కారణమని ఆయన అన్నారు. భారత దేశ భవిష్యత్తును సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్ణయిస్తున్నాయని అన్నారు. శాస్ర్తవేత్తల దృఢమైన సంకల్పం దేశానికి ఎంతో మేలు చేశాయని అన్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  twitter  tweet  budget  

Other Articles